చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు

ఇవాళ భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి. ఈ రోజును పరాక్రమ్ దివాస్‌గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితమే నిర్ణయించింది. కటక్‌కు చెందిన జానకీనాథ్ బోస్, ప్రభావతిలకు 1897 లో సరిగ్గా ఇదే రోజున జన్మించారు. కటక్‌లో ప్రాథమిక విద్య చదివిన బోస్.. ఉన్నత విద్యను కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తిచేశారు. కోల్‌కతా యూనివర్సిటీ నుంచి బీఏ ఫిలాసఫీ చదివిన సుభాష్.. 1819లో ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లారు. కోల్‌కతాలో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలచే ప్రేరణ పొందిన బోస్.. తన చదువుల కంటే తన మతమే చాలా ముఖ్యమని తెలుసుకున్నారు.
తండ్రికి ఇచ్చిన మాట మేరకు సివిల్ సర్వీస్ ఉద్యోగానికి ఎంపికైన బోస్.. బ్రిటిష్ అధికారుల కింద పనిచేయడం ఇష్టం లేక 1921 లో సివిల్స్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం స్వరాజ్ పత్రికను ప్రారంభించి స్వాతంత్ర కోరికను ప్రజల్లో రగల్చడంలో ఎన్నో కథనాలు ప్రచురించారు. అనంతరం నేషనల్ కాంగ్రెస్‌లో చేరి బెంగాల్ ప్రావిన్స్ పబ్లిసిటీ బాధ్యతలు చేపట్టారు. 1923 లో అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, బెంగాల్ కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1925 లో బ్రిటిష్ సేనలు అరెస్ట్ చేసి జైలుకు పంపాగా.. 1927 లో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో ముఖ్యపదవులు నిర్వర్తించిన బోస్.. కొన్ని అంశాల్లో గాంధీతో విభేదించడంతో బలవంతంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయించారు. దాంతో 1939 జూన్ 22 న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు.
1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన సమయంలో ఆంగ్లేయులను దెబ్బతీయటానికి సువర్ణవకాశంగా భావించిన బోస్.. కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాల్లో పర్యటించారు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పర్చారు. 1945 ఆగస్టు 18 లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బోస్ మరణించారని టోక్యో రేడియో ప్రకటించినప్పటికీ.. అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాని పలువురు ఇప్పటికీ నమ్ముతారు. సుభాష్ చంద్ర బోస్ మరణానికి సంబంధించిన నిజాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం మూడు కమిటీలు ఏర్పాటు చేసింది. విమాన ప్రమాదంలో మరణించారని రెండు కమిటీలు తేల్చాయి. మనోజ్ కుమార్ ముఖర్జీ నేతృత్వంలో మూడో కమిటీ.. అసలు విమాన ప్రమాదమే జరుగలేదని, అలాంటప్పుడు ఎలా మరణిస్తారని పేర్కొన్నది. అయితే, ఈ నివేదికను ప్రభుత్వం తిరస్కరించింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు:
2009: సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో సిగరెట్ తాగే దృశ్యాలపై నిషేధం విధింపు
2002: పాకిస్తాన్‌లోని కరాచీలో అమెరికన్ జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ కిడ్నాప్, దారుణహత్య
1997: బిల్ క్లింటన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా నియమితులైన మడేలిన్ ఆల్బ్రైట్. మొదటి మహిళా విదేశాంగ మంత్రిగా నిలిచారు.
1977: ఇందిరా గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా జనతా పార్టీ ఏర్పాటు
1989: తజికిస్థాన్‌లో భూకంపం.. వందలాది మంది మృతి
1976: తవ్వకాల్లో బయటపడిన తప్పిపోయిన గౌతమ్ బుద్ధ నగరం కపిల్
1973: వియత్నాం శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు నిక్సన్
1926: శివసేన స్థాపకుడు బాల్ ఠాక్రే జయంతి
1920: ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ మెయిల్ సర్వీస్ ప్రారంభం
1664: శివాజీ తండ్రి షాహుజీ మరణం
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పొట్టేళ్ల పందెం పోటీలు.. మూడు రాష్ర్టాల నుంచి 22 జీవాలు రాక
- శివుడి సాక్షిగా అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్
- చదివింది 'పది'.. వ్యాపారం 'కోటి'..
- ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
- అబద్ధాల బీజేపీ ఆరేండ్లుగా ఏం చేసింది?
- బీజేపీని నువ్వు కొన్నవా..?
- రైల్వే ఉద్యోగం పేరుతో మోసం
- పనిమనిషిపై పాశవికం..
- మల్టీలెవల్ పేరిట మోసాలు
- బీ పాస్ తప్పనిసరి