కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో దేశవ్యాప్తంగా దవాఖానల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఎదురవుతున్నది. ఆక్సిజన్ కోసం రోగులు దీనంగా ఎదురుచూస్తున్నారు. తమ వారిని రక్షించుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్ల కోసం పలువురు పగలూ, రాత్రుళ్లూ పడిగాపులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మార్కెట్లోకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మన ఇండ్లలోనే వాడుకుంటూ ఆక్సిజన్ సిలిండర్ల సమస్యను పరిష్కరించుకోవచ్చు. మన దేశంలో లభిస్తున్న ఐదు రకాల ఉత్తమ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ యంత్రాల గురించి తెలుసుకుందాం.
ఎవాక్స్ ఎలక్ట్రిక్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ప్రస్తుతం మార్కెట్లో లభించే ఉత్తమమైనది, చవకైనది. ఈ యంత్రం మన దేశంలో రూ.45,000 కు లభిస్తున్నది. ఇది 5 ఎల్పీఎం సామర్థ్యంతో పని చేస్తుంది. 93 శాతం వరకు ఆక్సిజన్ సాంద్రతను అందిస్తుంది.
మోడల్ నంబర్ JAY-1 పోర్టబుల్ ఆక్సిజన్ సాంద్రత 3 లీటర్ సామర్థ్యంలో దొరుకుతున్నాయి. ఈ కాన్సంట్రేటర్ భారతదేశంలో రూ.40,000 ధరకు లభిస్తున్నది. ప్రస్తుతం దేశంలో దొరుకుతున్న వాటిలో చవకైనదిగా నిలిచింది. ఈ యంత్రం బ్యాటరీ, ఎలక్ట్రికల్ రెండింటి ద్వారా పనిచేస్తుంది. రెండింటి ద్వారా నిరంతరం ఆక్సిజన్‌ను పొందవచ్చు. తక్కువ ఆక్సిజన్ స్వచ్ఛత, అధిక శ్వాస రేటు గురించి హెచ్చరిస్తుంది.
మోడల్ నంబర్ JAY-5 మెడికల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కూడా మార్కెట్లో దొరుకుతున్నది. ఈ యంత్రం ధర రూ.60,000. ఇది పూర్తిగా కరెంట్ ఆధారంగా పనిచేస్తుంది. బ్యాటరీపై పనిచేయదు. ఇది ఇండియమార్ట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది.
ఇంటి కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కొనాలనుకుంటే ఇండియమార్ట్ వెబ్సైట్లో పలు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న అనేక ఎంపికలలో ఒకటి రూ.35,000 ధరకు లభిస్తున్నది. ఈ యంత్రాలు నిమిషానికి 1 నుంచి 51 ప్రవాహాన్ని అందిస్తాయి.
ఇది పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్. ఇది 5 ఎల్పీఎం సామర్థ్యంతో ఆక్సిజన్‌ను అందిస్తుంది. రివైవ్ లైఫ్‌సైన్స్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బరువు 15 కిలోలుగా ఉంటుంది. దీని ధర రూ.35,000.
శ్రీలంకలో డెడ్లీ కరోనా వైరస్ గుర్తింపు
కరోనా నిబంధనల ఉల్లంఘన : 13 మంది అభ్యర్థులపై ఎఫ్ఐఆర్
కరోనా ఎఫెక్ట్ : పూరీ జగన్నాథ్ ఆలయం మూసివేత
అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్‌పై ఆర్బీఐ నిషేధం
భారతదేశంలో పరిస్థితి ఘోరమైనది : డబ్ల్యూహెచ్ఓ
సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు.. కేసు నమోదు
రెమ్‌డెసివిర్‌కు బదులుగా నీళ్ల ఇంజెక్షన్.. రోగి మృతి
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..