గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 31, 2020 , 16:26:03

ముఖం పుర్రెలాగా కనిపించాలని చెవులు కోసుకున్నాడు

ముఖం పుర్రెలాగా కనిపించాలని చెవులు కోసుకున్నాడు

సాధారణంగా ఆకర్షణీయంగా కనిపించడానికి వంటి మీద టాటూలు వేయించుకుంటారు. కొంత మంది తమకు ఇష్టమైన వారి పేర్లను మెడ, మణికట్టు తదితర భాగాలపై రాసుకుంటారు. అందంగా కనిపించడానికి శస్ర్త చికిత్సలు చేయించుకుంటారు. కానీ ఓ జర్మన్‌ యువకుడు మాత్రం తనను తాను వికారంగా మార్చుకోవడానికి టాటూలు వేయించుకొని శరీర భాగాలను తొలగించుకున్నాడు. 

జర్మనీలోని ఫిన్‌స్టర్‌వాల్డేలో నివాసం ఉంటున్న 39 ఏళ్ల సాండ్రో తన ముఖం పుర్రెలాగా కనబడడం కోసం రెండు చెవులను తొలగించుకుని వాటిని ఒక డబ్బాలో భద్రపర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా జుట్టు మొత్తం తీసేసి గుండు నిండా, చెంపలు, నుదురు, మెడ భాగాలతో పాటు శరీరం మొత్తం టాటూలు వేయించుకున్నాడు. ఈ టాటూలకు గాను సుమారు రూ.5లక్షలు ఖర్చు చేసినట్లు సాండ్రో తెలిపాడు. సాండ్రో తన ముక్కు కొన భాగాన్ని, కనుబొమ్మలను కూడా తొలగించి ఆ ప్రాంతంలో టాటూ వేయించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపాడు


2007లో టీవీలో ఓ వ్యక్తిని చూసి తాను కూడా అలా మారాలని నిశ్చయించుకున్నట్లు సాండ్రో తెలిపాడు. తన ముఖం పుర్రెలాగా కనిపించడం కోసం ఇలా చేశానని పేర్కొన్నాడు. తన రూపం భయంకరంగా మారడంతో ఆ ప్రభావం ఉద్యోగం, ఇతర సంబంధాలపై చూపిందని అతడు తెలిపాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు సాండ్రోను విచిత్రంగా చూడటమే కాకుండా భయపడేవారు కూడా. స్కల్‌ మ్యాన్‌ అని పిలుస్తుండేవారని, ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనని సాండ్రో పేర్కొన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo