శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 14, 2020 , 14:25:01

నేటి గూగుల్‌ డూడుల్‌కున్న ప్రత్యేకతిదే..!

నేటి గూగుల్‌ డూడుల్‌కున్న ప్రత్యేకతిదే..!

హైదరాబాద్‌: గతేడాది డిసెంబర్‌ నుంచి కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో బయటకు వెళ్తే కరోనా వైరస్‌ ఎక్కడ అంటుకుంటుందోనని చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి చాలామంది సేవలందించారు. వారినే కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పిలుస్తున్నాం. అందులో డాక్టర్లు, హెల్త్‌కేర్‌ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఇతరులున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో, ఆంక్షల సడలింపు తర్వాత దుకాణాదారులు, బస్సు డ్రైవర్లు, చెఫ్‌లు, డోర్‌డెలివరీ బాయ్స్‌ సేవలందిస్తున్నారు. వీరందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ ముందుకొచ్చింది. నేటి డూడుల్‌లో వీరికి కృతజ్ఞతలు తెలుపుతూ యానిమేటెడ్‌ పిక్స్‌ను ఉంచింది. 

డూడుల్‌లో చెఫ్, డాక్టర్, డెలివరీ బాయ్‌, బస్సు డ్రైవర్, దుకాణదారుడు, అగ్నిమాపక వ్యక్తి, ఉపాధ్యాయుడు ఉన్నారు. మధ్యలో ఉన్న లవ్‌ ఎమోజి వినియోగదారులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి ఎక్కువ గంటలు కృషి చేస్తున్న డెలివరీ పర్సనల్ అందరికీ ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తుంది. డూడుల్‌పై కర్సర్‌ పెడితే ‘టు ఆల్‌ ది కరోనా వైరస్‌ హెల్పర్స్‌, థ్యాంక్యూ’ అని వచ్చేలా సందేశం ఉంచింది.  ఈ డూడుల్ ఉత్తర అమెరికా, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, కెన్యా, ఘనా, సెనెగల్, ఒమన్ పాకిస్తాన్, మొరాకో, జపాన్, థాయిలాండ్‌, ఇండియాతోపాటు మరెన్నో దేశాలలో అందుబాటులో ఉంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo