సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 19:35:00

క్వీన్ ఆఫ్ ది నైట్ పువ్వులు ఎలా వికసిస్తాయో తెలుసా..? వీడియో చూడండి..

క్వీన్ ఆఫ్ ది నైట్ పువ్వులు ఎలా వికసిస్తాయో తెలుసా..? వీడియో చూడండి..

హైదరాబాద్‌: క్వీన్‌ ఆఫ్‌ ది నైట్‌ పువ్వులు వికసించే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 49 సెకన్ల నిడివిగల వీడియోను చూసినవారంతా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. క్వీన్‌ ఆఫ్‌ ది నైట్‌ పువ్వుల శాస్త్రీయ నామం ఎపిఫిలమ్‌ ఆక్సిపెటాలమ్‌. ఇవి అరుదుగా కనిపిస్తాయి. రాత్రి సమయంలోనే అవి వికసిస్తాయి.

ఈ వీడియోను ట్విట్టర్‌ యూజర్‌ @ఇయేట్‌మగ్గ్‌ల్స్‌ పంచుకున్నారు. ‘2 క్వీన్ ఆఫ్ ది నైట్ (ఎపిఫిలమ్ ఆక్సిపెటాలమ్) వికసిస్తుంది’ అనే శీర్షిక పెట్టారు. ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో వైరల్ అయ్యింది. 66,000 కంటే ఎక్కువమంది వీక్షించారు. 2,700 మంది లైక్‌ చేశారు. పువ్వులు వికసిస్తుండగా చూడడం ఇది మొదటిసారి.. అమేజింగ్‌ అంటూ నెటిజన్లు రీట్వీట్‌ చేశారు. logo