బుధవారం 03 జూన్ 2020
International - Apr 14, 2020 , 14:53:03

ఆ దేశాల్లో ఒక్క క‌రోనా కేసూ లేద‌ట‌!

ఆ దేశాల్లో ఒక్క క‌రోనా కేసూ లేద‌ట‌!

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌తో ఇప్పుడు ప్ర‌పంచ దేశాలు విల‌విల్లాడుతున్నాయి. ల‌క్ష‌ల్లో కేసులు న‌మోద‌వుతున్నాయి. వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. అంతేకాదు, వివిధ దేశాల ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌లు కూడా చితికిపోతున్నాయి. అగ్ర‌రాజ్యాలు సైతం ఆర్థికంగా కుదేల‌య్యాయి. అయినా కొన్ని దేశాల్లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ట‌. ఆయా దేశాల ప్ర‌జ‌లు ఎప్ప‌టిలాగే ఏ ఆంక్ష‌లు, అడ్డంకులు లేకుండా త‌మ జీవ‌నం సాగిస్తున్నార‌ట‌. 

జాన్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైన వివ‌రాల ప్ర‌కారం.. కొమొరోస్, లెసోతో, మార్షల్ దీవులు, పలావు, నౌరు, సమోవ, కిరిబాటి, వనౌటు, సోలమన్ దీవులు, టోన్గా, టువాలు, తుర్క్మెమెనిస్థాన్‌, తజికిస్తాన్ దేశాల్లో క‌రోనా జాడ‌లు లేవ‌ట‌. ఇక చైనాకు పక్కనే ఉన్న‌ ఉత్తరకొరియాలో కూడా ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని పదే, పదే ప్రకటన‌లు వెలువ‌డుతున్న‌ప్ప‌టికీ కిమ్ వైఖరిపై పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo