సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 07, 2020 , 14:59:37

హాంగ్‌కాంగ్ నుంచి త‌ప్పుకోనున్న‌ టిక్‌టాక్‌

హాంగ్‌కాంగ్ నుంచి త‌ప్పుకోనున్న‌ టిక్‌టాక్‌

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు టిక్‌టాక్ పేర్కొన్న‌ది.  జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని చైనా అమ‌లు చేయ‌డంతో తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియా యాప్ టిక్‌టాక్ వెల్ల‌డించింది.  హాంగ్‌కాంగ్‌లో త‌మ ఆప‌రేష‌న్స్‌ను నిలిపివేస్తున్న‌ట్లు టిక్‌టాక్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. త్వ‌ర‌లోనే ఆ న‌గ‌రానికి టిక్‌టాక్ సేవ‌లను నిలిపివేయ‌నున్నారు.  హాంగ్‌కాంగ్ పోలీసుల‌కు స‌మాచారం విష‌యంలో స‌హ‌క‌రించేందుకు ఇప్ప‌టికే ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ సంస్థ‌లు వెన‌క్కు త‌గ్గాయి. ఇప్ప‌టికే టిక్‌టాక్‌ యాప్‌ను ఇండియా బ్యాన్ చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కూడా ఈ యాప్‌ను బ్యాన్ చేయాల‌ని చూస్తున్నాయి.

చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ సంస్థ టిక్‌టాక్ వీడియో యాప్‌ను లాంచ్ చేసింది.  ప్ర‌పంచ దేశాల యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు టిక్‌టాక్ పేరుతో యాప్‌ను రిలీజ్ చేశారు.  ఇదే సంస్థ చైనాలో డౌయిన్ అనే షేరింగ్ యాప్‌ను కూడా ఆప‌రేట్ చేస్తున్న‌ది. టిక్‌టాక్‌కు చెందిన యూజ‌ర్ డేటాను చైనాలో స్టోర్ చేయ‌డంలేద‌ని వాల్ట్‌డెస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయ‌ర్ తెలిపారు. తాజాగా చైనా రూపొందించిన జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని హాంగ్‌కాంగ్ ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు.  దీంతో డేటా ప్రైవ‌సీపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతున్న‌ది.  ఈ నేప‌థ్యంలోనే హాంగ్‌కాంగ్‌లో త‌మ ఆప‌రేష‌న్స్ నిలిపివేస్తున్న‌ట్లు టిక్‌టాక్ చెప్పింది.   


logo