బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Feb 27, 2020 , 18:21:59

టిక్‌ టాక్‌ స్టార్‌ చావు దగ్గరగా వెళ్లొచ్చాడు..వీడియో చూడండి

టిక్‌ టాక్‌ స్టార్‌ చావు దగ్గరగా వెళ్లొచ్చాడు..వీడియో చూడండి

సోషల్‌ మీడియా వీడియో షేరింగ్‌ ఫ్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో రకరకాల వీడియోలు షేర్‌ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. వినోదం కోసం వీడియోలు చేస్తే ఏం ఫర్వాలేదు. కానీ కొందరైతే టిక్‌టాక్‌ కోసం ప్రాణాలు సైతం రిస్క్‌లో పడేస్తున్నారు. తాజాగా ఓ టిక్‌టాక్‌ స్టార్‌ చావుకు దగ్గర దాకా వెళ్లి తృటిలో తప్పించుకున్నాడు. జాసన్‌ క్లార్క్‌ అనే వ్యక్తి 4 లక్షల ఫాలోవర్లతో టిక్‌టాక్‌ స్టార్‌ గా పేరొందాడు. అతడు ఓ రిస్కీ ఫీట్‌ చేశాడు. తన పెట్‌తో కలిసి జాసన్‌ క్లార్క్‌  చలికి గడ్డ కట్టిన సరస్సులో ఈత కొట్టేందుకు వెళ్లాడు.

జాసన్‌ క్లార్స్‌ ఒక దగ్గర మంచును పగులగొట్టి..నీటిలోకి దిగి  ఈత కొట్టడం షురూ చేశాడు. అయితే సులువుగా అలా వెళ్లేసి ఇలా తిరిగి రావొచ్చనుకున్నాడు క్లార్క్‌. కానీ అతడు ఈత కొడుతూ ముందుకు వెళ్లగా అంతటా గడ్డ కట్టిన నీరు మాత్రమే కనిపిస్తోంది. తాను ఎక్కడైతే ఈత మొదలు చేశానో అక్కడికి వెళ్లేందుకు చాలా సేపు ప్రయత్నించాడు క్లార్క్‌. దాదాపు క్లార్క్‌కు ఊపిరాగిపోయినంత పనైంది. మొత్తానికి ఎలాగోలా సురక్షితంగా స్టార్టింగ్‌ పాయింట్‌ కు చేరుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ వీడియోను చూస్తున్నంతసేపు అసలు క్లార్క్‌ బయటకు వస్తాడా..?లేదా అని నెటిజన్లు ఉత్కంఠగా ఎదురుచూశారు. నేను ఈత కొడుతుండగా రంధ్రానికి దగ్గరగా ఉన్నాననుకున్నానని కామెంట్‌ పోస్ట్‌ చేసిన జాసన్‌ క్లార్క్‌..ఆ తర్వాత తాను అనుకున్నది నిజం కాదని తెలుసుకున్నాడు. ఈ వీడియోకు టిక్‌టాక్‌లో 21 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. 

logo
>>>>>>