బుధవారం 21 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 13:09:58

ట్రంప్ స‌ర్కార్‌పై కోర్టుకు టిక్‌టాక్‌

ట్రంప్ స‌ర్కార్‌పై కోర్టుకు టిక్‌టాక్‌

హైద‌రాబాద్‌: టిక్‌టాక్‌పై అమెరికా ప్ర‌భుత్వం బ్యాన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ నిషేధాన్ని స‌వాల్ చేస్తూ టిక్‌టాక్ సంస్థ‌.. అమెరికా కోర్టును ఆశ్ర‌యించింది. టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ శుక్ర‌వారం రాత్రి ట్రంప్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఫెడ‌ర‌ల్ కోర్టులో ద‌ర‌ఖాస్తు న‌మోదు చేసింది. ట్రంప్ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ టిక్‌టాక్ కోర్టును ఆశ్ర‌యించ‌డం ఇది రెండ‌వ‌సారి.  ట్రంప్ త‌న అధికారాల‌ను దుర్వినియోగం చేశార‌ని బైట్‌డ్యాన్ త‌న ఫిర్యాదులో ఆరోపించింది. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం యాప్‌ను బ్యాన్ చేసిన‌ట్లు పేర్కొన్న‌ది. బ్యాన్ విధించ‌డం వ‌ల్ల‌ భావ‌స్వేచ్చ హ‌క్కుల‌ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని టిక్‌టాక్ ఆరోపించింది. త‌మ భావాల‌ను వ్య‌క్తప‌రిచేంద‌కు ల‌క్ష‌లాది మంది అమెరికా పౌరులు ఆన్‌లైన్ ద్వారా ఒక్క‌ట‌య్యార‌ని, వారిని ట్రంప్ స‌ర్కార్ అడ్డుకుంటోంద‌ని త‌మ ఫిర్యాదులో టిక్‌టార్ పేర్కొన్న‌ది. అమెరికా యూజ‌ర్ల ప్రైవ‌సీ, భ‌ద్ర‌త విష‌యంలో టిక్‌టాక్ క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌ని, తాము చూపిన ఆధారాల‌ను ట్రంప్ స‌ర్కార్ విస్మ‌రిస్తున్న‌ద‌ని బైట్‌డ్యాన్స్ వెల్ల‌డించింది. logo