శనివారం 06 జూన్ 2020
International - Apr 06, 2020 , 10:02:34

పులికి క‌రోనా పాజిటివ్‌..!

పులికి క‌రోనా పాజిటివ్‌..!

న్యూయార్క్‌ : క‌రోనా వైర‌స్ ఇపుడు ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా (కోవిడ్‌-19)వైర‌స్ ఇప్ప‌టివ‌ర‌కు మ‌నుషులకు మాత్ర‌మే ఒక‌రి నుంచి ఒక‌రికి సోకుతూ వ‌చ్చింది. అయితే తాజాగా తొలిసారి జంతువుల్లో క‌రోనా వైర‌స్‌ను గుర్తించారు. అవును మీరు విన్న‌ది నిజ‌మే. అమెరికాలో ఇప్ప‌టికే క‌రోనా మ‌హమ్మారిపై పోరాటం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో..తాజాగా ఓ పులికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

అమెరికాల‌ని బ్రోంక్స్ జూలో నాలుగేళ్ల మ‌ల‌య‌న్ ఆడ‌పులికి క‌రోనా సోకిన‌ట్లు యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ నేష‌న‌ల్ వెట‌ర్నరీ లాబ‌రేట‌రీస్ స‌ర్వీసెస్ టీం ఈ విషయాన్ని నిర్దారించింది. జూలో జంతువుల ఆల‌నాపాల‌నా చూసుకునే  ఓ ఉద్యోగి (క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తి) పులికి క‌రోనా సోకిన‌ట్లు బోంక్స్ జూ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.మార్చి 16 నుంచి బ్రోంక్స్ జూలో సంద‌ర్శ‌కుల ప్ర‌వేశాన్ని నిషేధించారు. 

logo