సోమవారం 01 మార్చి 2021
International - Jan 20, 2021 , 16:12:19

ట్రంప్‌‌ రిటైర్‌మెంట్.. కూతురు ఎంగేజ్‌మెంట్‌..!

ట్రంప్‌‌ రిటైర్‌మెంట్.. కూతురు ఎంగేజ్‌మెంట్‌..!

వాషింగ్ట‌న్: అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌కు ఆఖ‌రి రోజైన జ‌న‌వ‌రి 20కి ఒక్క‌రోజు ముందు ఆయ‌న చిన్న కుమార్తె టిఫ‌నీ ట్రంప్ (27) త‌న ఎంగేజ్‌మెంట్ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. తాను మూడేండ్లుగా ప్రేమిస్తున్న మైఖేల్ బౌల‌స్ (23)‌తో త‌న‌ ఎంగేజ్‌మెంట్  జ‌రిగింద‌ని టిఫనీ ట్రంప్ వెల్ల‌డించింది. డొనాల్డ్‌ ట్రంప్‌కు, ఆయ‌న రెండో భార్య అయిన మ‌ర్లా మాపుల్స్‌కు క‌లిగిన సంతానమే ఈ టిఫ‌నీ ట్రంప్‌. వైట్ హౌస్‌లో మంగళవారం ప్రియుడు మైఖేల్ బౌలోస్‌తో త‌న నిశ్చితార్థం జ‌రిగింద‌ని పేర్కొంటూ టిఫ‌నీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోల‌ను పోస్ట్ చేసింది. 

'కుటుంబ సభ్యులతో కలిసి వైట్‌హౌస్‌లో నిశ్చితార్థం జ‌రుపుకోవ‌డం సంతోషంగా ఉంది. మైఖేల్‌తో నిశ్చితార్థం నాకు ప్రత్యేక సందర్భం. ఇంత‌క‌న్నా అదృష్టం ఇంకేదీ లేదు. ఆ త‌ర్వాత జ‌రుగ‌బోయే తంతు గురించి ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నా' అని టిఫ‌నీ ట్రంప్ ఇన్‌స్టాలో పేర్కొన్న‌ది. టిఫనీ పోస్ట్‌కు స్పందించిన ఆమె ప్రియుడు బౌలోస్ కూడా అదే ఫోటోను షేర్‌ చేస్తూ 'లవ్ యు హనీ' అని కామెంట్ చేశాడు. 

కాగా, ఈ ఎంగేజ్‌మెంట్ సంద‌ర్భంగా దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 13 క్యారెట్ల ఎమరాల్డ్ కట్ డైమండ్‌ రింగును టిఫనీ వేలుకు తొడిగాడ‌ట మైఖేల్‌ బౌలోస్. ఈ డైమండ్ రింగ్‌‌ విలువ సుమారుగా 1.2 మిలియన్ డాలర్‌లు (మ‌న క‌రెన్సీలు దాదాపు రూ.9 కోట్లు) ఉంటుంద‌ని అంచనా. డొనాల్డ్ ట్రంప్‌, మార్లా మాపుల్స్ ఏకైన సంతాన‌మైన టిఫనీ ట్రంప్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. 

ఆమె ప్రియుడు మైఖేల్ బౌల‌స్ లండన్‌కు చెందిన‌ వ్యాపారవేత్త. బిలియన్ డాలర్ల నైజీరియా సంస్థ వారసుడైన బౌలస్ లెబ‌నాన్‌లో జ‌న్మించాడు.‌ లండన్‌ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. కాగా, టిఫ‌నీ, మైఖేల్ జంట తొలిసారి 2018 జనవరిలో కెమెరా కంటికి చిక్కడంతో వారి ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. కాగా, ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలోనే అయ్య రిటైర్‌మెంట్‌, బిడ్డ ఎంగేజ్‌మెంట్ జ‌రుగ‌డం గ‌మ‌నార్హం. 

 

ఇవి కూడా చదవండి.. 

బైడెన్ ఈవెంట్‌కు ఎంత మంది వ్య‌క్తిగ‌తంగా హాజ‌ర‌వుతున్నారో తెలుసా ?

వైట్‌హౌస్‌కు ఆ పేరెలా వచ్చింది.. దాని చరిత్ర మీకు తెలుసా!

కమలా హ్యారిస్‌.. కొన్ని ఆసక్తికర విషయాలు

బైడెన్ స‌క్సెస్ సాధించాలని ఆశిస్తున్నా: డోనాల్డ్ ట్రంప్‌

చివ‌రి రోజు.. 73 మందికి క్ష‌మాభిక్ష పెట్టిన ట్రంప్‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo