ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 09:40:17

యాంకీస్‌తో టిక్‌టాక్‌ డీల్‌

యాంకీస్‌తో టిక్‌టాక్‌ డీల్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 13: వరుసగా పలు దేశాల్లో నిషేధాలను ఎదుర్కొంటున్నప్పటికీ చైనా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ దూకుడు తగ్గటం లేదు. సెప్టెంబర్‌ 15లోపు నిషేధం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన కొన్ని రోజులకే అదే దేశానికి చెందిన బేస్‌బాల్‌ టీమ్‌ యాంకీస్‌తో టిక్‌టాక్‌ భారీ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం యాంకీస్‌ జట్టు ఆడే మ్యాచ్‌ల హైలైట్స్‌ టిక్‌టాక్‌లో ప్రసారమవుతాయి. ఆ జట్టు ఆటగాళ్ల ఫ్రొఫైల్స్‌ తదితర వివరాలు కూడా వారాంతాల్లో టిక్‌టాక్‌లో అందిస్తారు. యువతకు మరింత చేరువయ్యేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని యాంకీస్‌ తెలిపింది.logo