టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజులు గడువు పెంపు...

వాషింగ్ టన్ : ప్రస్తుత అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విభాగం చైనీస్ యాప్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజుల పాటు గడువును పెంచింది. ఈ మేరకు కోర్టుకు సమాచారం ఇచ్చింది. దీంతో డిసెంబర్ 4వ తేదీలోగా టిక్‌టాక్‌ను విక్రయించడానికి బైట్ డ్యాన్స్‌కు సమయం దొరికింది. టిక్ టాక్‌ను అమెరికా సంస్థలకు విక్రయించాలని ట్రంప్ పాలనా వర్గం ఆగస్ట్‌లో ఆదేశించింది. ఈ గడువును పలుమార్లు పొడిగించింది. తాజాగా 27వ తేదీతో గడువు ముగియడంతో మరో వారం రోజులు పెంచింది.
తొలుత ఆగస్ట్ ప్రారంభంలో 45 రోజుల గడువు ఇచ్చారు. ఇప్పుడు దానిని 90 రోజులకు నవంబర్ 12వ తేదీకి పొడిగించారు. అనంతరం మరో 15 రోజులు పొడిగించి, నవంబర్ 27వ తేదీ వరకు అవకాశమిచ్చారు. ఇప్పుడు మరో వారం పొడిగింపు లభించింది. నిర్దేశించిన గడువులోగా టిక్‌టాక్ అమ్మకం ప్రక్రియను బైట్ డ్యాన్స్ పూర్తి చేయాలి. అమెరికన్ యూజర్ల డేటాను పూర్తిగా తొలగించాలి. అమెరికా జాతీయ భద్రతను బైట్ డ్యాన్స్ ప్రమాదంలోకి నెట్టివేస్తోందనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ట్రంప్ తన గత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టిక్ టాక్ యాప్ వ్యాల్యుయేషన్ 50 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నది. అమెరికాలో టిక్‌టాక్‌కు 100 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ