ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 03, 2020 , 14:33:13

సోనీ మ్యూజిక్‌ తో టిక్ టాక్ భాగస్వామ్యం...

 సోనీ మ్యూజిక్‌ తో టిక్ టాక్ భాగస్వామ్యం...

ఢిల్లీ : చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ (ఎస్‌ఎంఇ) తో ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ కొత్త డీల్‌ ప్రకారం యాప్ లో సోనీ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్స్ ను క్రియేటర్స్ ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. టిక్‌టాక్ యూజర్లు సోనీ మ్యూజిక్‌ ఆర్టిస్ట్ ల కంటెంట్‌ వాడుకోవచ్చని టిక్‌టాక్‌ ఓ ప్రకటనలో  వెల్లడించింది. ఈ ఒప్పందంతో సోనీ మ్యూజిక్ ప్రస్తుత హిట్స్, కొత్త రిలీజ్ లు, ఐకానిక్ క్లాసిక్స్ లాంటివి టిక్‌టాక్ క్రియేటర్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సోనీ మ్యూజిక్ క్లిప్‌లను ప్రదర్శించడాని కంటే మించి వాటిని ప్రమోట్ చేసే ప్రయత్నాలతోపాటు, యూజర్లకు మంచి మ్యూజిక్‌ అందుబాటులోకి వస్తుందని సోనీ మ్యూజిక్‌ ప్రతినిధి తెలిపారు. టిక్‌టాక్ ఇప్పటికే యూనివర్సల్, సోనీ వార్నర్‌లతో స్వల్పకాలిక లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.