శనివారం 04 జూలై 2020
International - Jun 18, 2020 , 18:38:29

ల‌డ‌ఖ్‌ ఒక వేలు మాత్ర‌మే.. భార‌త్‌కు వార్నింగ్ ఇచ్చిన టిబెట్ నేత‌

ల‌డ‌ఖ్‌ ఒక వేలు మాత్ర‌మే.. భార‌త్‌కు వార్నింగ్ ఇచ్చిన టిబెట్ నేత‌

హైద‌రాబాద్: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌పై చైనా క‌న్నేసిన‌ట్లు టిబెట్‌కు చెందిన బ‌హిష్కృత నేత లాబ్‌సాంగ్ సాంగే తెలిపారు. అయితే అది చేతిలో ఒక వేలు మాత్ర‌మే అని, డ్రాగ‌న్ దేశం మ‌రో నాలుగు ప్రాంతాల‌ను ఆక్ర‌మించ‌నున్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు.  టిబెట్‌ను కూడా చైనా ఆక్ర‌మించింద‌ని, ఆ ప్రాంతాన్ని మావో జిడాంగ్‌, ఇత‌ర చైనా నేత‌లు అర‌చేతిగా భావించార‌ని, ఆ త‌ర్వాతే అయిదు వేళ్ల‌ను ఆక్ర‌మించాల‌‌నున్న‌ట్లు టిబెట్ నేత లాబ్‌సాంగ్ తెలిపారు.  దాంట్లో ల‌డ‌ఖ్ తొలి వేలు అని, ఇక నేపాల్‌, భూటాన్‌, సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్రాంతాల‌ను కూడా డ్రాగ‌న్ దేశం ఆక్ర‌మించ‌నున్న‌ట్లు లాబ్‌సాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీని ప‌ట్ల భార‌త్ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. గాల్వ‌న్ గొడ‌వ నేప‌థ్యంలో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. 


logo