గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 21:11:53

2021 జూలై నుంచి WHO‌తో అమెరికా తెగదెంపులు

2021 జూలై నుంచి WHO‌తో అమెరికా తెగదెంపులు

వాషింగ్టన్: 2021 జూలై నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)‌తో అమెరికా తెగదెంపులు చేసుకోనున్నది. డబ్ల్యూహెచ్‌‌వో ప్రధాన, ప్రాంతీయ కార్యాలయాల్లో ఆరోగ్య, మానవ సేవల నుంచి పూర్తిగా తప్పుకుంటామని ఆ దేశ ప్రతినిధి గురువారం మీడియాకు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశాల ప్రాధాన్యత బట్టి వ్యవహరిస్తామని చెప్పారు. 2020 ఆర్థిక ఏడాదికి సంబంధించి డబ్ల్యూహెచ్‌వో‌కు చెల్లించాల్సిన నిధులపై సమీక్ష జరిపి పాక్షికంగా చెల్లిస్తామని తెలిపారు.

కరోనా మహమ్మారితోపాటు గత పదేండ్లలో తలెత్తిన ఇతర ఆరోగ్య సంక్షోభాల నివారణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా విఫలమైందని అమెరికా ఆరోపించించి. అంతేగాక అత్యవసరంగా సంస్కరణలు చేపట్టడానికి బదులు చైనా మద్దతుతో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని విమర్శించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూలై నుంచి డబ్ల్యూహెచ్‌వో కార్యకలాపాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు గురువారం వెల్లడించింది.
 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo