సోమవారం 25 జనవరి 2021
International - Nov 27, 2020 , 15:47:17

మూడేండ్ల బుడతడు ఏకంగా రూ .74 వేల మీల్ ప్యాక్ ఆర్డర్ చేసాడు...

మూడేండ్ల బుడతడు ఏకంగా రూ .74 వేల మీల్ ప్యాక్ ఆర్డర్ చేసాడు...

బ్రసిలియా:మూడేండ్ల బుడతడు రూ .74 వేల మీల్ ప్యాక్ ఆర్డర్ చేసాడు. అవును మీరు చదివింది కరక్టే.. ఎక్కడంటే.... బ్రెజిల్ లో మూడేండ్ల బుడతడు ఏకంగా రూ .74 వేల విలువ చేసే మ్యాసివ్ మ్యాక్ డొనాల్డ్ మీల్ ఆర్డర్ చేసేసాడు. ఇందులో భాగంగా ఏకంగా 10 ఫుడ్ బ్యాగ్స్ ఇంటికి వచ్చాయి. వీటిలో ఆరు ప్రమోషనల్ మీల్స్ , మరొక ఆరు హ్యాపీ మీల్స్   , ఎనిమిది స్పెషల్ ఆఫర్ టాయ్స్  , పది మిల్క్ షేక్స్ , ఎనిమిది వాటర్ బాటిల్స్,  ఉన్నాయి.

ఈ ఫుడ్ పాకెట్స్ ను హ్యాపీగా లాగిస్తున్నబుడతడు ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ కుటుంబం ఎక్కువగా బయటి నుంచే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నది. ఇదంతా గమనించిన బేబీ కూడా తల్లిదండ్రుల్లానే తాను కూడా ఫుడ్ ఆర్డర్ చేశాడు.  ఆ బాబు తల్లి తన ఫోన్ ను అతనికి అప్పగించి వేరే పనిలో నిమగ్నమై ఉండడంతోనే ఇలాజరిగింది. బుడతడు చేసిన పనికి వాళ్ళ కుటుంబ సభ్యులంతా అవాక్కయారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo