బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 17:11:17

యూకేలో మ‌రో మూడు వారాలు లౌక్‌డౌన్ పొడ‌గింపు

యూకేలో మ‌రో మూడు వారాలు లౌక్‌డౌన్ పొడ‌గింపు

లండ‌న్‌: బ్రిట‌న్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టికే ఆ దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య ల‌క్ష‌కు చేరువైంది. యూకేలో మొత్తం 98,476కి బాధితులు చేరుకోగా..12,868 మంది క‌రోనాతో మృతిచెందారు. యాక్టివ్ కేసులు సంఖ్య‌85,264గా ఉంది. క‌రోనా నియంత్ర‌ణ‌కు ఇప్ప‌టికే ప‌లు దేశాలు లాక్డౌన్ పొడ‌గించ‌గా..అదే బాట‌లో బ్రిట‌న్ కూడా చేరింది. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న కేసుల దృష్ట్యా అక్క‌డి ప్ర‌భుత్వం మ‌రో మూడు వారాల పాటు లౌక్‌డౌన్ పొడ‌గించింది. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తూ...ప్ర‌జ‌లు ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని సూచించింది.logo