శుక్రవారం 27 నవంబర్ 2020
International - Nov 03, 2020 , 21:32:25

రేపు భారత్‌ రానున్న మరో మూడు రాఫెల్ విమానాలు

రేపు భారత్‌ రానున్న మరో మూడు రాఫెల్ విమానాలు

న్యూఢిల్లీ :  భారత వైమానిక దళం అమ్ముల పొదిలో మరో మూడు రాఫెల్‌ జెట్‌ ఫైటర్లు రేపు చేరనున్నాయి. ఇప్పటికే ఐదు రాఫెల్‌ జెట్‌లు భారత్‌ చేరుకుని వైమానిక దళంలో సేవలందిస్తున్నాయి. బుధవారం సాయంత్రం కల్లా మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌ రానున్నాయి. పొందనుంది. ఈ విమానాలు రేపు ఉదయం ఫ్రాన్స్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. సాయంత్రం  హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకోనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అదనపు రాఫెల్‌ విమానాల రాకతో భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరనున్నది. భారత్‌ ఇప్పటికే రాఫెల్స్‌ను చైనా సరిహద్దు ప్రాంతాల్లో కార్యాచరణ పాత్రలో మోహరించడం ప్రారంభించింది. మొదటి బ్యాచ్‌లో భాగంగా ఐదు రాఫెల్స్ విమానాలు జూలై 28 న భారతదేశానికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 10 న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారికంగా వైమానిక దళంలో చేర్చుకున్నది. ఎన్‌డీఏ ప్రభుత్వం 2016 లో ఫ్రాన్స్‌లోని రాఫెల్‌ సంస్థతో చేసుకున్న రూ.60 వేల కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 36 విమానాలు 2022 మధ్య నాటికి భారత్‌ చేరుకుంటాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.