ఆదివారం 24 జనవరి 2021
International - Jan 13, 2021 , 09:53:58

క్యాపిట‌ల్ హిల్ దాడి‌.. ముగ్గురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు క‌రోనా

క్యాపిట‌ల్ హిల్ దాడి‌.. ముగ్గురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు క‌రోనా

వాషింగ్ట‌న్: అమెరికా క్యాపిట‌ల్ హిల్‌పై జ‌న‌వ‌రి ఆర‌వ తేదీన ట్రంప్ మ‌ద్ద‌తుదారులు దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ దాడి త‌ర్వాత‌.. ఉభ‌య‌స‌భ‌ల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు తేలింది. హౌజ్‌కు చెందిన డెమోక్ర‌టిక్ నేత‌లు బొన్నీ వాట్స‌న్ కోల్మ‌న్‌, ప్ర‌మీలా జ‌య‌పాల్‌, బ్రాడ్ సిండ‌ర్‌లు క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్ వ‌చ్చారు.  మాస్క్‌లు లేకుండా.. సోష‌ల్ డిస్టాన్స్ పాటించ‌కుండా.. ట్రంప్ అభిమానులు క్యాపిట‌ల్ హిల్ భ‌వనంలోకి దూసుకువెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే ఉభ‌య‌స‌భ‌ల్లో ఉన్న ప్ర‌తినిధులు కూడా మాస్క్‌లు లేకుండా.. భౌతిక దూరం పాటించుకుండా ఉండిపోయారు. దీంతో క్యాపిట‌ల్ హిల్‌లో ఉన్న వారికి వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిక‌లు వెలుబ‌డిన విష‌యం తెలిసిందే. 

ఆ దాడి జ‌రిగిన రోజున భ‌యంతో కొంద‌రు స‌భ్యులు బంక‌ర్‌లోకి వెళ్లారు. ఒకే ద‌గ్గ‌ర వాళ్లంతా త‌ల‌దాచుకున్నారు. దీంతో వైర‌స్ వ్యాప్తి చెందిన‌ట్లు అనుమానిస్తున్నారు. డెమోక్రాట్ ప్ర‌మీలా జ‌య‌పాల్ మాస్క్ లేకుండా క‌నిపించారు.  అయితే ఆ రోజు క్యాపిట‌ల్ హిల్ భ‌వ‌నంలో ఉన్న చాలా మంది నేత‌ల‌కు వైర‌స్ సోకి ఉంటుంద‌ని వైద్య నిపుణులు భావిస్తున్నారు.  క్యాపిట‌ల్ దాడి సూప‌ర్ స్ప్రెడింగ్ ఈవెంట్‌గా మారినా ఆశ్చ‌ర్యం లేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. 


logo