గురువారం 26 నవంబర్ 2020
International - Nov 04, 2020 , 17:14:19

ఎయిరిండియా విమానాలను లండన్‌ వెళ్లనివ్వం..!

ఎయిరిండియా విమానాలను లండన్‌ వెళ్లనివ్వం..!

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపులు వచ్చాయి. దాంతో విమానాశ్రయం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. రేపు లండన్‌కు బయలుదేరే రెండు ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. విమానాశ్రయం అధికారులు బెదిరింపు కాల్‌ చేసిన వారు.. విమానాలను లండన్‌లో దిగనివ్వమని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

బెదిరింపులు ఖలీస్తానీ గ్రూపు నుంచి వచ్చిన ఉగ్రవాద బెదిరింపులుగా పోలీసులు భావిస్తున్నారు. ఖలీస్తాన్ కమాండో ఫోర్స్ అనే బృందం ఈ బెదిరింపును జారీ చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఖలీస్తాన్ కమాండో ఫోర్స్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద గురు పత్వంత్‌సింగ్ పన్నూ చాలా మందికి బెదిరింపు కాల్స్ చేసారని, గురువారం నాడు లండన్‌ బయల్దేరే రెండు ఎయిర్ ఇండియా విమానాలకు కూడా బెదిరించారు అని డీసీపీ రాజీవ్ రంజన్ తెలిపారు. విమానాశ్రయానికి బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడంతో ఢిల్లీ పోలీసులు, విమానాశ్రయ అధికారులతో పాటు ఎయిర్ ఇండియా, విమానాశ్రయానికి కాపలాగా ఉండే సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు అప్రమత్తమయ్యాయి. న్యూఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు 36 ఏండ్ల క్రితం నవంబర్‌ ఒకటో తేదీ నుంచి నాలుగు రోజులపాటు కొనసాగిన నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్‌ రావడం యాధృచ్చికమని అధికారులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.