ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 17, 2020 , 19:41:12

వూహాన్ వాటర్ పార్కులో మాస్కులు లేకుండా సందర్శకుల సందడి

వూహాన్ వాటర్ పార్కులో మాస్కులు లేకుండా సందర్శకుల సందడి

బీజింగ్: కరోనా వ్యాప్తికి మూలమైన చైనాలోని వూహాన్ నగరంలో జనం మాస్కులు లేకుండా సందడి చేశారు. వారాంతరంలో అక్కడి వాటర్ పార్కు వద్ద వేలాది మంది పార్టీ చేసుకున్నారు. వూహాన్‌లోని మాయా వాటర్ పార్కు వద్ద నిర్వహించిన మ్యూజిక్ ఫెస్టివల్‌కు వేలల్లో సందర్శకులు తరలివచ్చారు. వారంతా ముఖానికి మాస్కులు లేకుండా తెగ ఎంజాయ్ చేశారు. అక్కడి స్విమ్మింగ్ పూల్స్‌లో జలకాలాడారు. వూహాన్ నగరం సాధారణ స్థితికి చేరుకున్నదన్న సంకేతాన్ని ఇచ్చారు.

గత ఏడాది డిసెంబర్‌లో వూహన్‌లోని పచ్చి మాంసం మార్కెట్ నుంచి కరోనా వైరస్ వ్యాపించగా ఆ నగరంలో 76 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. జూన్ నెల నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయగా అక్కడి వాటర్ పార్కు తిరిగి తెరుచుకున్నది. దీంతో సందర్శకులను ఆకర్షించేందుకు ప్రవేశ టికెట్లపై రాయితీ ఇస్తున్నారు. మహిళా సందర్శకులకు 50 శాతం వరకు తగ్గింపు ప్రకటించారు. కాగా పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు హుబై ప్రావిన్సులోని 400 పర్యాటక ప్రాంతాలకు స్థానిక ప్రభుత్వం ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నది.
తాజావార్తలు


logo