శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 04, 2021 , 15:57:53

బీజింగ్‌లో కోవిడ్ టీకా కోసం క్యూక‌ట్టిన వేలాది మంది

బీజింగ్‌లో కోవిడ్ టీకా కోసం క్యూక‌ట్టిన వేలాది మంది

బీజింగ్‌‌:  చైనాలోనూ కోవిడ్ టీకా పంపిణీ జ‌రుగుతున్న‌ది. ఆ దేశ రాజ‌ధాని బీజింగ్‌లో వేల సంఖ్య‌లో జ‌నం కోవిడ్ టీకా తీసుకునేందుకు క్యూ క‌ట్టారు. వ‌చ్చే నెల‌లో చైనా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ల‌క్ష‌లాది మందికి వ్యాక్సిన్ ఇవ్వాల‌ని ఆ దేశం భావిస్తున్న‌ది.  వ్యాక్సినేష‌న్ మొద‌లైన రెండు రోజుల్లోనే.. బీజింగ్‌లో సుమారు 73 వేల మంది కోవిడ్ టీకా వేశారు.  క‌మ్యూనిటీ వ‌ర్క‌ర్లు, బ‌స్సు డ్రైవ‌ర్లు .. కోవిడ్ టీకా తీసుకున్న‌వారిలో ఉన్నారు.  సైనోఫార్మ్ సంస్థ త‌యారు చేసిన కోవిడ్ టీకాకు ఆ దేశ ప్ర‌భుత్వం ష‌ర‌తుల‌తో కూడిన ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.  


logo