బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 16:13:13

చైనాకు వ్యతిరేకంగా మాట్లాడితే జైలుశిక్షే..

చైనాకు వ్యతిరేకంగా మాట్లాడితే జైలుశిక్షే..

బీజింగ్ : చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనలో బహిరంగంగా మాట్లాడటం నిషేధించబడింది. ఎవరైనా అలా చేస్తే అతన్ని అరెస్టు చేసి జైలు ఊచల వెనుకకు పంపుతారు. కొద్ది రోజుల క్రితం బీజింగ్‌లోని సింఘువా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఝు ఝురున్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించడంతో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు జీ జిన్‌పింగ్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటున్న కఠిన విధానాలను తప్పుడువని చెప్పడమే ఆయన చేసిన తప్పు. వెంటనే అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఒక వారం పోలీసు కస్టడీలో ఉండి ఈరోజే జైలు నుంచి విడుదలయ్యాడు. చైనాలో ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించే అతికొద్ది మందిలో ఝు ఝురున్ ఒకరు. కరోనావైరస్ ను నివారించడానికి ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేయలేదని, ఫలితంగా అంటువ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని ఆయన విమర్శించారు.

జిన్‌పింగ్ నిర్ణయాలు విధాన వైఫల్యానికి దారితీస్తే, కోర్సును సరిదిద్దడమే కాదు, బాధ్యులు తమ తప్పులను అంగీకరించాలి అని ప్రొఫెసర్ ఝు ఝురున్ ఒక వ్యాసం రాశారు. అధికారాన్ని చేపట్టిన వెంటనే సార్వత్రిక మానవ హక్కులు, పార్టీ అధికారంపై రాజ్యాంగ పరిమితులు వంటి ఉదారవాద అభిప్రాయాలను తిరస్కరించే ప్రచారాన్ని జిన్ పింగ్ ప్రారంభించారు. దాంతో 

ఝు ఝురున్ ను సింఘువా విశ్వవిద్యాలయం బోధన, పరిశోధన విధుల నుంచి తప్పించింది. దాంతో ఆయన ఆదాయాన్ని కోల్పోయాడు. అయినప్పటికీ చైనా ప్రభుత్వ విధానాలపై వ్యాసాలు రాస్తూ విదేశాల్లో ప్రచురించేందుకు పనిచేస్తున్నారు. తనను త్వరలోనే ప్రభుత్వం నిర్బంధించే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన స్నేహితులతో చెప్పాడు. తనలా ఎవరైనా చైనా ప్రభుత్వానికి, కమ్యూనిస్ట్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి జైలుశిక్ష గ్యారంటీ అని ఝు ఝురున్ అన్నారు.


logo