గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 01, 2020 , 15:03:28

జాబ్‌ వచ్చిన సంతోషంలో రోడ్డుపై చిందేసింది..!

జాబ్‌ వచ్చిన సంతోషంలో రోడ్డుపై చిందేసింది..!

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. బతుకుదెరువు కష్టమైపోయింది. చిన్న ఉద్యోగం దొరికినా చాలు జీవితాన్ని నెట్టుకురావొచ్చని అందరూ చూస్తున్నారు. ఈ సమయంలో ఉద్యోగం సంపాదించిన ఓ యువతి ఆనందం పట్టలేకపోయింది. జాబ్‌ పొందిన మరుక్షణమే ఆఫీస్‌ వెలుపల రోడ్డుపై చిందేసింది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

ఈ వీడియోను యువతిని పనిలోకి తీసుకున్న యజమానురాలు సోషల్‌మీడియాలో పెట్టింది. @డేఏకేఏఆర్‌ఏ_స్పెన్స్‌ అనే యూజర్‌ నేమ్‌తో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. యువతి డ్యాన్స్‌ చేయడం సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. ఇదిచూసి ఆనందించిన కంపెనీ యజమానురాలు వీడియోను షేర్‌ చేసింది. ‘నేను ఈ యువతిని ఈరోజు పనిలోకి తీసుకున్నాను.. ఆమె రియాక్షన్‌ చూడండి’ అని ఆమె దీనికి శీర్షిక పెట్టింది. ఈ వీడియోను ఊహించనివిధంగా 5.5 లక్షలకు పైగా వీక్షించారు. ‘ఆమెకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని పలువురు కామెంట్‌ చేశారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo