శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 10, 2020 , 14:19:58

కరోనా దేవుడి శిక్ష అన్న మతపెద్దకు పాజిటివ్‌..!

కరోనా దేవుడి శిక్ష అన్న మతపెద్దకు పాజిటివ్‌..!

కీవ్: స్వలింగ వివాహం చేసుకున్నందుకు దేవుడు విధించిన శిక్ష కొవిడ్‌-19 అని చెప్పిన ఓ మతపెద్దకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కీవ్ పాట్రియార్చేట్‌, ఉక్రేనియన్ ఆర్థోడాక్స్ చర్చి చీఫ్‌ పాట్రియార్క్ ఫిలారెట్ కొవిడ్‌-19 బారినపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని సీఎన్ఎన్ నివేదించింది.

‘కీవ్‌ పాట్రియార్క్, రష్యా-ఉక్రెయిన్ ఫిలారెట్‌కు కొవిడ్‌ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం, పవిత్ర బిషప్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పాట్రియార్క్ ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉంది.’ అని చర్చి తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని పవిత్ర ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపింది. ఆయన కోసం ప్రార్థనలు చేసే ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది.  91 ఏళ్ల వయసున్నపాట్రియార్క్ ఫిలారెట్ ఈ ఏడాది మార్చిలో ఉక్రేనియన్ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ, కరోనావైరస్ మహమ్మారి దేవుడి శిక్ష అని అభివర్ణించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo