సోమవారం 19 అక్టోబర్ 2020
International - Sep 22, 2020 , 16:00:28

గడ్డి మరక అంటిన ప్యాంట్‌ ధర రూ .88వేలు..!

గడ్డి మరక అంటిన ప్యాంట్‌ ధర రూ .88వేలు..!

హైదరాబాద్‌: గడ్డి మరక అంటిన ప్యాంట్‌కు అంత ధర ఏంటి? అని ఆలోచిస్తున్నారా..! అవును మీరు చదివింది నిజమే. లగ్జరీ, డిజైనర్‌ బ్రాండ్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్‌ కంపెనీ గుస్సీ ఇలాంటి ప్యాంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. లేతనీలిరంగు జీన్స్‌ ప్యాంట్‌పై గడ్డి మరక అంటినట్లు దీన్ని డిజైన్‌ చేశారు. దీని ధర 1,200 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ .88,290 అన్నమాట.  

గుస్సీ కంపెనీ నాణ్యమైన తోలు  బెల్టులు, జాకెట్లు, బ్యాగులు, బూట్లు, జీన్స్‌కు ప్రసిద్ధి. దీని ఉత్పత్తులు భారీ డిమాండ్‌ను కలిగి ఉంటాయి. కాగా, తాము వింటర్‌ కలెక్షన్‌ 2020 కింద ఈ గడ్డి మరకల జీన్స్‌ను తీసుకొచ్చామని కంపెనీ పేర్కొంది. ఈ వైడ్-లెగ్ డెనిమ్ ప్యాంట్‌ను సేంద్రీయ పత్తితో తయారుచేసినట్లు పేర్కొంది. ఈ ప్యాంట్‌ ధరిస్తే చలికాలం గడ్డిలో కూచున్నా మరకలు అంటాయనే ఫీల్‌ కలగదని కంపెనీ అంటోంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo