గురువారం 28 మే 2020
International - May 07, 2020 , 20:13:08

ఇలాంటి రెస్టారెంట్ ఉంటే క‌రోనా మాటే ఉండ‌దు!

ఇలాంటి రెస్టారెంట్ ఉంటే క‌రోనా మాటే ఉండ‌దు!

లాక్‌డౌన్ తీసేసిన త‌ర్వాత రెస్టారెంట్లు ఎలా ర‌న్ చేయాల‌నే ఆలోచ‌న‌లో డ‌చ్‌కు చెందిన ఓ రెస్టారెంట్ వినూత్నంగా ఆలోచించింది. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల కోసం గ్లాజు క్యాబిన్లు, ప‌బ్లిక్ డాబాలుగా నిర్మించారు. క్యాబిన్‌లో ఇద్దరు కూర్చొని ఉంటే.. వెయిట‌ర్లు చేతికి గ్లౌజులు ధ‌రించి, నల్లటి వస్త్రాధరణతో సామాజిక దూరం పాటిస్తూ స‌ర్వ్ చేస్తున్నారు. 

అనుకున్నట్లుగా ఇదంతా జ‌రుగుతుందో లేదో అని ఈటెన్ (ETEN) రెస్టారెంట్ ట్రైల్స్ వేసింది. ఈ వీడియోలో క‌నిపించిన వారంతా రెస్టారెంట్ స్టాఫ్ బంధువులు, ఫ్రెండ్స్‌. ఇది కచ్చితంగా అంద‌రినీ ఆక‌ర్షిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. బీచ్ పక్కన క్యాండిల్ డిన్నర్‌ చేస్తున్న అనుభూతిని క‌లిగిస్తుంద‌ని కూడా చెప్పారు.


logo