సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 09:08:44

20 నిమిషాల్లోనే అత్యంత కచ్చితత్వంతో కరోనా పరీక్ష

20 నిమిషాల్లోనే అత్యంత కచ్చితత్వంతో కరోనా పరీక్ష

మెల్‌బోర్న్‌: శరీరంలో కరోనా వైరస్‌ ఉనికిని అత్యంత కచ్చితత్వంతో 20 నిమిషాల్లోనే గుర్తించే పరీక్ష విధానాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ  పరీక్ష విధానం చాలా చౌకయినదని, సులభమైనదని మెల్‌బోర్న్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ టిమ్‌ స్టీనర్‌ తెలిపారు. టెస్టింగ్‌ పద్ధతికి ఎన్‌1-స్టాప్‌-ల్యాంప్‌ అని పేరు పెట్టారు. ఈ వివరాలను జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ మైక్రోబయాలజీలో ప్రచురించారు. ఇప్పటివరకు చాలా టెస్టింగ్‌ విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఫలితాల్లో కచ్చితత్వం తక్కువని ఆయన అన్నారు. logo