సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 12, 2020 , 21:07:48

రొయ్యలతో మెనిక్యూర్‌..!

రొయ్యలతో మెనిక్యూర్‌..!

లాస్‌ఏంజిల్స్‌: మెనిక్యూర్‌ అంటే గోర్ల శుభ్రత, వాటిని అందంగా తీర్చిదిద్దడం. ఏ బ్యూటీపార్లర్‌కెళ్లినా ఇది సాధారణంగానే ఉంటుంది. కానీ లాస్‌ఏంజిల్స్‌లోని నెయిల్‌ సన్నీ మాత్రం సరికొత్త విధానంతో ముందుకొచ్చారు. రొయ్యలతో మెనిక్యూర్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వార్తల్లోనూ నిలిచారు. 

నెయిల్ సన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది.  ఇటీవల రొయ్యల మెనీక్యూర్‌తో ముందుకొచ్చింది. సెలూన్‌లో అసలు రొయ్యలను గోర్లపై ఉంచుతారు. రొయ్య తలవరకూ కట్‌చేసి, అందులో ఉన్న మొత్తాన్ని తీసేసి గోర్లపై అతికిస్తారు. ఈ ప్రాన్‌ మెనిక్యూర్‌ను వీడియో తీసి పెట్టగా, సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.