శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 12:38:37

వ్యర్థాలను సేక‌రిస్తున్న మెడిక‌ల్ స్టూడెంట్‌... వాటితో ఏం చేస్తుందంటే!

వ్యర్థాలను సేక‌రిస్తున్న మెడిక‌ల్ స్టూడెంట్‌... వాటితో ఏం చేస్తుందంటే!

క‌శ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన తబీష్ ఐజాజ్ ఖాన్ అనే విద్యార్థి తన రెండు కోరికలను ఒకేసారి తీర్చుకుంటున్న‌ది. ఒక‌వైపు డాక్ట‌ర్ అవ్వ‌డానికి సిద్ద‌మ‌వుతుంది. మ‌రోవైపు వ్య‌ర్థ ప‌దార్థాల‌ను అద్భుత‌మైన చిత్రాలుగా మారుస్తున్న‌ది. ఇప్పుడు త‌బీష్ వేసిన చిత్రాలు సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యాయి. ఎంతోమంది నుంచి త‌బీష్ ప్ర‌సంశ‌లు అందుకుంటుంది.

"నేను 2016 లో పెయింటింగ్ మొదలుపెట్టాను. నేను వేసిన చిత్రాల‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశాను. వీటికి మంచి పేరొచ్చింది. అంద‌రి ప్ర‌సంశ‌లు మ‌రిన్ని చిత్రాలు వేయ‌డానికి నన్ను ప్రోత్సహిస్తుంది. ఇది నా అభిరుచి అని చెప్పుకొచ్చింది త‌బీష్‌. కాన్వాస్ షీట్, పేపర్‌, ఆకులు, చెక్క‌, విరిగిన కప్పు, ఎగ్‌షెల్, రాయి వంటి వ్యర్థ పదార్థాలపై కూడా పెయింట్ వేస్తుంది. భూమ్మీద ఉన్న ప్ర‌తి వ‌స్తువు ప‌నికి వ‌స్తుంద‌ని త‌బీష్ న‌మ్ముతుంది. త‌బీష్ అభిరుచికి త‌ల్లిదండ్రులు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆమె చేసే మంచి ప‌నికి త‌ల్లిదండ్రులు కూడా గ‌ర్వ‌ప‌డుతున్నారు.