శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 08, 2021 , 15:15:53

క్యాపిట‌ల్ హిల్ నిర‌స‌న‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప‌ట్టుకున్న‌ది ఇత‌డే!

క్యాపిట‌ల్ హిల్ నిర‌స‌న‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప‌ట్టుకున్న‌ది ఇత‌డే!

వాషింగ్ట‌న్‌: యూఎస్ కాంగ్రెస్‌పై జ‌రిగిన దాడిలో ఆందోళ‌న‌కారుల చేతుల్లో చాలా వ‌ర‌కూ క‌నిపించిన‌వి అమెరిక‌న్ కాన్ఫిడ‌రేట్ జెండాలు లేదంటే అమెరికా జెండాలు. కానీ ఈ నిర‌స‌న‌ల్లో ఒక ద‌గ్గ‌ర భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం క‌నిపించ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. తాజాగా ఆ జెండా ప‌ట్టుకున్న వ్య‌క్తి ఎవ‌రో బ‌య‌ట‌ప‌డింది. అత‌ని పేరు విన్సెంట్ జేవియ‌ర్ పాల‌తింగ‌ల్‌. అత‌డు వ‌ర్జీనియాకు చెందిన వ్య‌క్తి. అత‌ని మూలాలు కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన‌వ‌ని తేలింది. గ‌తంలో విన్సెంట్‌.. ట్రంప్ ప్రెసిడెంట్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్‌లో స‌భ్యుడిగా కూడా ఉన్నాడు. 

త్రివ‌ర్ణ ప‌తాకం ఎందుకు?

ప్ర‌ముఖ చానెల్ న్యూస్‌18 విన్సెంట్‌తో ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మాట్లాడింది. అయితే తాను క్యాపిట‌ల్ హిల్‌పై దాడి జ‌రిగిన స‌మ‌యంలో తాను అందులో లేన‌ని చెప్పాడు. ఎన్నిక‌ల్లో జ‌రిగిన మోసానికి వ్య‌తిరేకంగా శాంతియుతంగా నిర‌స‌న తెల‌ప‌డానికే తాను అక్క‌డ ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు. ట్రంప్ మ‌ద్ద‌తుదారులు జాత్యాహంకారులు కాద‌ని, అక్క‌డ జ‌రిగింది జాత్యాహంకార ఉద్య‌మం కాద‌ని చెప్ప‌డానికే తాను త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ప‌ట్టుకున్న‌ట్లు అత‌ను చెప్ప‌డం గ‌మ‌నార్హం. అది ఒక‌వేళ జాత్యాహంకార ఉద్య‌మ‌మే అయితే తాను అలా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ప‌ట్టుకునేవాడిని కాద‌ని చెప్పాడు. అక్క‌డున్న ట్రంప్ మ‌ద్ద‌తుదారుల్లో ప‌ది మంది ఇండియ‌న్స్ ఉన్నార‌ని, అందులో ఐదుగురు కేర‌ళ‌కు చెందిన వాళ్లేన‌ని తెలిపాడు. తాను ఎప్పుడు ట్రంప్ ర్యాలీల్లో పాల్గొన్నా.. వియ‌త్నాం, కొరియా, పాకిస్థాన్‌కు చెందిన వాళ్లు తమ దేశాల జెండాలు ప‌ట్టుకుంటార‌ని, అందుకే ఈసారి కూడా ఇది అలాంటి ర్యాలీయే అని చెప్ప‌డానికే తాను అలా చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశాడు. 

ఇదేమీ పెద్ద హింస కాదు

క్యాపిట‌ల్ హిల్‌లో జ‌రిగిన హింస‌ను విన్సెంట్ సీరియ‌స్‌గా తీసుకోలేదు. బిల్డింగ్ బ‌య‌ట ఉన్న ల‌క్ష‌ల మందిలో ఓ 50 మంది ఈ హింస‌కు పాల్ప‌డ్డార‌ని, దీనివ‌ల్ల త‌మ ర్యాలీ ప్ర‌యోజ‌నం దెబ్బ‌తిన్న‌ద‌ని విన్సెంట్ అన్నాడు. ట్రంప్ మ‌ద్ద‌తుదారులంటూ బ‌య‌టి వ్య‌క్తులు అందులో చొర‌బ‌డ్డార‌ని, వాళ్లే ఈ హింస‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించాడు. 


ఇవి కూడా చ‌ద‌వండి

గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ ఇప్పిస్తాన‌ని 8 కోట్ల మోసం

సిడ్నీ టెస్ట్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డు

రోహిత్‌, గిల్‌ల‌ను రెచ్చ‌గొట్టిన ల‌బుషేన్‌‌.. వీడియో

క్యాపిట‌ల్ హిల్ అటాక్‌.. సూప‌ర్ స్ప్రెడింగ్ ఈవెంట్ !

త‌న‌కు తాను క్ష‌మాభిక్ష .. ట్రంప్ మ‌రో సంచ‌ల‌నం!

ప్రెగ్నెన్సీ కోసం ల‌‌ఢాక్‌కు యురోపియ‌న్ అమ్మాయిలు.. ఎందుకు?

హెచ్‌-1బీ వీసా: లాట‌రీ ప‌ద్ధ‌తికి గుడ్‌బై


logo