శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Oct 23, 2020 , 21:48:36

అతడి ఇంటి పేరు కరోనా.. చెప్తే ఎవరూ నమ్మట్లేదట..!

అతడి ఇంటి పేరు కరోనా.. చెప్తే ఎవరూ నమ్మట్లేదట..!

బెర్లిన్‌: ఓ 38 ఏళ్ల వ్యక్తి తన ఇంటి పేరుతో బాధపడుతున్నాడు. కారణం కరోనా..!కరోనా ఎలా కారణమైందని అనుకుంటున్నారా? అతడిపేరు జిమ్మీ కరోనా.. కరోనా ఆయన సర్‌నేమ్‌. అయితే, కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచి అతడు ఎవరికి తన ఇంటి పేరు చెప్పినా.. జోక్‌ చేయకు అని అంటున్నారట. ఐడీ కార్డు చూపించేదాకా నమ్మట్లేదట. 

జిమ్మీ కరోనా.. ఓ నిర్మాణరంగ కార్మికుడు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీలోని నిర్బంధ శిబిరం నుంచి ప్రాణాలతో బయటపడిన జోసెఫ్ కరోనా మనవడు ఈయన. జిమ్మీ కరోనా తన భార్యకు ప్రసవం చేయించేందుకు దవాఖానకు వెళ్లాడు. అక్కడ సిబ్బంది పేరు అడగ్గా జిమ్మీ కరోనా అని చెప్పాడట. వారు అస్సలు నమ్మలేదట. ఎంత చెప్పినా ‘నిజం చెప్పండి సార్‌’ అని అడిగారట. దీంతో తన వ్యాలెట్‌లోంచి ఐడీ కార్డు తీసి చూయించాడట జిమ్మీ కరోనా. ఈ ఒక్కచోటే కాదు.. చాలాచోట్ల అతడికి ఈ సమస్యే ఎదురవుతున్నదట. బార్లు, పబ్‌లకు వెళ్లినప్పుడు, ఫుడ్‌ డెలివరీ ఇచ్చినప్పుడు తన ఇంటిపేరుతో సమస్య వస్తోందని అతడు వాపోతున్నాడు. గుర్తింపు కార్డు చూయించేదాకా ఎవరూ నమ్మట్లేదని అంటున్నాడు. ఐడీకార్డు లేకుంటే ఇక తనను ఎవరూ నమ్మేలా లేరని పేర్కొంటున్నాడు జిమ్మీ కరోనా.

తాజావార్తలు