శనివారం 06 జూన్ 2020
International - May 22, 2020 , 13:48:40

ఈ ఉడుత మెనూ లిస్ట్ ఏంటో తెలుసా?

ఈ ఉడుత మెనూ లిస్ట్ ఏంటో తెలుసా?

మనుషులకు విందు, దానికో మెనూ లిస్ట్‌ ఉంటుందని తెలుసు కాని మాటలు రాని ఉడుతకు కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా?

మీరు విన్నది నిజమే. లాక్‌డౌన్‌ సమయంలో జర్మనీలోని మ్యూనిచ్‌ నగరానికి చెందిన మ్యాక్సీ ఫ్యామిలీ ఓ ఉడుతకు విందు ఏర్పాట్లు చేస్తున్నది. ఉడుతకి మేడమ్‌ అని కూడా నామకరణం చేసిందా ఫ్యామిలీ. మేడమ్‌కి ఆకలి వేసినప్పుడు ఉదయం, సాయంత్రం అలా మ్యాక్సీ ఇంటి ఆవరణలోని బాల్కనీ వద్దకు వస్తుంది. అక్కడే మేడమ్‌ కోసం డైనింగ్‌ టేబుల్‌ కూడా ఏర్పాటు చేశారు. ఒక చెక్క టేబుల్‌, రెండు కుర్చీలు. అంతేకాదు ఒక చిన్న బీర్‌ కప్పు కూడా ఉంటుంది. సావరీల కోసం ఒక ప్లేట్ కూడా ఏర్పాటు చేశారు. మేడమ్‌కు పొద్దుతిరుగుడు విత్తనాలంటే చాలా ఇష్టమట. వీటిని నోటితో పీల్చేసి తింటుంది. అలాగె హాజెల్‌ నట్స్‌, వాల్నట్స్‌లతో పాటు ఎండుద్రాక్ష కూడా మెనూ లిస్ట్‌లో ఉంది. మేడమ్‌ ఆహార బాధ్యతలను పూర్తిగా మ్యాక్సీ కుటుంబమే చూసుకుంటుంది. లాక్‌డౌన్‌లో మేడమ్‌తో మంచి టైంపాస్‌ అవుతుంది. ఇది దొరకడం మా అదృష్టం అంటున్నది మ్యాక్సీ కుటుంబం. మేడమ్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసింది. 


logo