శనివారం 31 అక్టోబర్ 2020
International - Oct 10, 2020 , 17:11:18

'నియాన్‌' కుర్రాడు.. భలే భయపెడుతున్నాడు!

 'నియాన్‌' కుర్రాడు.. భలే భయపెడుతున్నాడు!

హాలోవీన్‌ డే.. విచిత్ర వేషాధారణ.. వింత దుస్తులతో ఒళ్లు గగుర్పొడిచేలా మేకప్‌ చేసుకుని అర్ధరాత్రి వేళ తిరుగుతారు. దీన్ని ఆల్‌ సెయింట్స్ డే (నవంబర్‌ 1) కి ముందురోజు రాత్రి జరుపుకుంటారు. మరో మూడువారాల్లో జరుగబోయే హాలోవీన్‌ డే కోసం రెండు నెలలుగా ఎందరో సిద్ధమవుతుంటారు. అందరిలాగే ఈ బుడ్డోడు కూడా హాలోవీన్‌ డే కోసం నియాన్‌ డ్రస్‌లో సిద్ధమయ్యాడు. 

'నియాన్‌' డ్రెస్‌లో అర్ధరాత్రి పూట ఓ పెద్దాయన చేయి పట్టుకున్ననడుస్తున్న కుర్రోడి ఫొటోను 'గ్రే అండ్ మామ' ఇన్‌స్ట్రాగ్రామ్‌లోని తన ఖాతాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. కేవలం ఐదు రోజుల్లోనే 12 లక్షలకు పైగా వ్యూస్‌ లభించాయంటే కుర్రోడి 'నియాన్‌' డ్రెస్‌ ఎంతగా భయపెట్టిందో కదూ! ఈ నెల 31 న జరిగే హాలోవీన్‌ డే ఈ చిన్నోడి డ్రెస్‌కే ఫస్ట్‌ ప్రైజ్‌.. మీరేమంటారు.


తాజావార్తలు