శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 11:58:05

ఒక్క త‌న్నుతో.. బైక‌ర్‌ను గాల్లో లేపేశాడు : వీడియో వైర‌ల్‌

ఒక్క త‌న్నుతో.. బైక‌ర్‌ను గాల్లో లేపేశాడు :  వీడియో వైర‌ల్‌

చిన్న పిల్ల‌లు తెలిసీ తెలియ‌క చేసే ప‌నులు అప్ప‌టిక‌ప్పుడు కోపం తెప్పించినా త‌ర్వాత న‌వ్వొస్తుంది. ఆ న‌వ్వు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోతేనే. ఓ బుడ్డోడు చేసిన చిలిపి ప‌నికి సోష‌ల్ మీడియాలో అంద‌రూ న‌వ్వుకుంటున్నారు. ఇంత‌కీ ఆ పిల్లాడు ఏం చేశాడో తెలుసా? ఓ వ్య‌క్తి బైక్ మీద కూర్చొని బైక్ స్టార్ట్ చేశాడు. కామ్‌గా ఉండ‌కుండా ఎస్క‌లేట‌ర్‌ను రైజ్ చేస్తున్నాడు.

అప్పుడే ఆ బుడ్డోడు వెనుక నుంచి వ‌చ్చి బైక్ గేర్‌ను నొక్కాడు. అంతే.. బైక్ గాల్లో ఎగిరింది. పాపం బైక్ మీద కూర్చొన్న అత‌ను మాత్రం కింద ప‌డ్డాడు. పిల్లాడు మాత్రం ఏం జ‌ర‌గ‌న‌ట్లుగా అక్క‌డే నిల‌బ‌డిపోయాడు. ఆ వ్య‌క్తికి మాత్రం కోప‌మొచ్చి పిల్లాడిని బాగా తిట్టాడు. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోను మీరు కూడా చూసి న‌వ్వుకోండి.