మంగళవారం 26 జనవరి 2021
International - Jan 07, 2021 , 10:55:24

1814లో బ్రిటీష‌ర్లు.. ఇప్పుడు ట్రంప్ అభిమానులు

1814లో బ్రిటీష‌ర్లు.. ఇప్పుడు ట్రంప్ అభిమానులు

వాషింగ్ట‌న్‌: అమెరికా కాపిట‌ల్ హిల్‌పై ట్రంప్ మ‌ద్ద‌తుదారుల దాడి ప్ర‌పంచాన్ని నివ్వెర ప‌రిచింది. ఏకంగా చ‌ట్ట స‌భ‌ల‌నే ల‌క్ష్యంగా చేసుకోవ‌డం, అదీ ప్ర‌స్తుతం అధ్య‌క్ష పీఠంపై ఉన్న వ్య‌క్తికి మ‌ద్ద‌తిచ్చే వాళ్లే ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ‌టం దేశాధినేత‌ల‌ను కూడా విస్తుపోయేలా చేసింది. సుమారు 207 ఏళ్ల త‌ర్వాత కాపిట‌ల్ హిల్‌పై ఇలా నేరుగా దాడి జ‌ర‌గడం ఇదే తొలిసారి. 

బ్రిటీష్ సేన‌ల ప్ర‌తీకారం

1812లో జ‌రిగిన యుద్ధంలో భాగంగా తొలిసారి దాడి జ‌రిగింది. 1814లో బ్రిటీష్ సేన‌లు అప్ప‌టికీ నిర్మాణంలో ఉన్న కాపిట‌ల్‌పై దాడి చేశారు. వైస్ అడ్మిర‌ల్ స‌ర్ అలెగ్జాండ‌ర్ కాక్‌బ‌ర్న్‌, మేజ‌ర్ జ‌న‌ర‌ల్ రాబ‌ర్డ్ రాస్ నేతృత్వంలోని బ్రిటీష్ సేన‌లు కాపిట‌ల్ హిల్‌కు నిప్పు పెట్టారు. అయితే ఆ వెంట‌నే భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో నిర్మాణానికి న‌ష్టం వాటిల్ల‌లేదు. అంత‌కు ఏడాది ముందు యార్క్‌లోని అప్ప‌ర్ కెన‌డా కాపిట‌ల్ బిల్డింగ్‌ను అమెరిక‌న్లు త‌గ‌ల‌బెట్టినందుకు ప్ర‌తిగా బ్రిటీష్ సేన‌లు ఈ దాడి చేశాయి. కాపిట‌ల్ హిల్‌తోపాటు వైట్‌హౌజ్‌కు కూడా నిప్పు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఆ స‌మ‌యంలో కెన‌డా ఇంకా ప్ర‌త్యేక దేశంగా లేదు. సుమారు 207 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి దాడి జ‌ర‌గ‌డంపై కాపిట‌ల్ హిస్టారిక‌ల్ సొసైటీ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. యూఎస్ కాపిట‌ల్ అనేది కేవలం ఒక భ‌వ‌నం కాద‌ని, అది అమెరిక‌న్ ప్రజాస్వామ్య ఆత్మ అని హిస్టారిక‌ల్ సొసైటీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 


ఇవి కూడా చ‌ద‌వండి

అమెరికా కాంగ్రెస్‌లో ఆందోళన హింసాత్మకం.. ఒకరి మృతి

ఐ ల‌వ్ యూ.. రెచ్చ‌గొట్టిన ట్రంప్‌

ట్రంప్ మ‌ద్ద‌తుదారుల‌పై మోదీ అస‌హ‌నం





logo