శనివారం 04 జూలై 2020
International - Jun 24, 2020 , 12:36:43

ఇది పాము కాదు..మరేంటి..? వీడియో

ఇది పాము కాదు..మరేంటి..? వీడియో

సోషల్‌మీడియాలో అప్పుడప్పుడు ఆసక్తికరంగా, వింతగా కనిపించే వీడియోలు చూస్తుంటారు. ఈ వీడియో కూడా దాదాపు అలాంటిదే. పాము పిల్లలాగా కనిపిస్తున్న వీడియో ఒకటి ఇపుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. మొదట ఫొటోను చూసినవారెవరైనా దాన్ని పాము అనే అనుకుంటారు. కానీ వీడియోను ప్లే చేసి చూస్తే అది పాము కాదని అర్థమవుతుంది. మధ్యలో చిప్పలాంటి శరీరం..చుట్టూ పొడవాటి ఐదు కాళ్లను కలిగియుండి పాకుతూ నీళ్లలోకి వెళ్లిపోతున్న వింత జీవిని వీడియోలో చూడొచ్చు. ఈ జీవి సర్వీసృపాల జాతికి చెందినదిగా పలువురు బావిస్తున్నారు.

లిడియా రాలే అనే మహిళ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ..అదేంటీ? క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. logo