బుధవారం 27 జనవరి 2021
International - Dec 31, 2020 , 11:15:12

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌.. ఏ దేశంలో ఎలా జ‌రుపుకుంటారో తెలుసా?

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌.. ఏ దేశంలో ఎలా జ‌రుపుకుంటారో తెలుసా?

కొత్త ఏడాది రోజు ఎలా ఉంటే మిగిలిన ఏడాదంతా అలాగే ఉంటార‌ట‌. దాదాపు ప్ర‌తి ఒక్క‌రి చిన్న‌త‌నంలోనూ ఇలా అన‌డం అంద‌రూ వినే ఉంటారు. అందుకే కొత్త ఏడాది వేడుక‌ల‌ను చాలా మంది ఘ‌నంగా జ‌రుపుకుంటూ ఉంటారు. ఆ రోజంతా ఉత్సాహంగా ఉండాల‌ని అనుకుంటారు. కొంద‌రైతే న్యూ ఇయ‌ర్ రెజ‌ల్యూష‌న్స్ అంటూ కొత్త ఏడాదిలో చేయ‌కూడ‌నివి, చేయాల్సిన‌వి లిస్ట్ రాసి పెట్టుకుంటారు. నిజానికి ఇక్క‌డే కాదు ఒక్కో దేశం ఒక్కోలా న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను జరుపుకుంటాయి. కొన్ని విన‌డానికి, చూడ‌టానికి చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. అలాంటి సాంప్ర‌దాయాలు ఉన్నదేశాలు ఏంటి? అవి న్యూఇయ‌ర్‌ను ఎలా సెల‌బ్రేట్ చేసుకుంటాయో మీరూ చూడండి. 

ఇట‌లీ: ఎర్ర‌టి అండ‌ర్ వేర్ వేసుకొని..

న్యూ ఇయ‌ర్‌ను కొత్త అండ‌ర్‌వేర్ వేసుకొని ఆహ్వానించ‌డం ఇటాలియ‌న్ల‌కు అలవాటు. ఇట‌లీలో ఎరుపును సంతాన సాఫ‌ల్య‌త‌కు గుర్తుగా భావిస్తారు. అందుకే కొత్త ఏడాదిని లోప‌ల ఎర్ర‌టి అండ‌ర్‌వేర్ వేసుకొని జ‌రుపుకోవ‌డం వ‌ల్లే ఆ ఏడాదిలో త‌మ‌కు సంతానం క‌లుగుతుంద‌న్న‌ది ఇటాలియ‌న్ల విశ్వాసం.

చిలీ: శ‌్మ‌శానంలో న్యూఇయ‌ర్‌

కొత్త ఏడాది ప్రారంభ‌మ‌య్యే రోజు అంద‌రూ గుళ్లూ గోపురాల‌కు తిరుగుతుంటారు. కానీ చిలీ ప్ర‌జ‌లు మాత్రం వెరైటీగా శ్మ‌శానాల్లో ఈ వేడుక‌ల‌ను జ‌రుపుకుంటారు. చ‌నిపోయిన త‌మ కుటుంబ స‌భ్యుల‌ను త‌మ న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో భాగం చేయ‌డానికే వాళ్లు ఇలా చేస్తారు. 

బ్రెజిల్‌: స‌ముద్రంలోకి తెల్ల‌టి పూలు విసిరేసి..

బ్రెజిల్‌లో స‌ముద్రంలోకి తెల్ల‌టి పూలను విస‌ర‌డం, క్యాండిల్స్‌ను విడిచిపెట్టి న్యూ ఇయ‌ర్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటారు. సముద్రుడిని శాంతింప‌జేయ‌డానికి, ఆశీస్సులు తీసుకోవ‌డానికి బ్రెజిలియ‌న్స్ ఇలా చేస్తుంటారు. 

స్పెయిన్‌: 12 ద్రాక్ష‌లు తింటూ..

స్పెయిన్‌లో 19వ శ‌తాబ్దంలో మొద‌లైన సాంప్ర‌దాయం ఇంకా కొనసాగుతోంది. గ‌డియారం ఒక్కో గంట కొట్టిన‌ప్పుడు ఒక్కో ద్రాక్ష తింటూ.. ఇలా మొత్తం 12 ద్రాక్ష‌ల‌ను తిన‌డం పూర్తి చేయాలి. అలా చేస్తే రానున్న 12 నెల‌లు అదృష్టాన్ని తీసుకొస్తుంద‌న్న‌ది స్పెయిన్ ప్ర‌జ‌ల విశ్వాసం. 

గ్రీస్‌: ఉల్లిగ‌డ్డ‌లు వేలాడ‌దీసి..

గ్రీస్ ప్ర‌జ‌లు త‌మ ఇంటి త‌లుపుల‌కు ఉల్లిగ‌డ్డ‌ల‌ను వేలాడ‌దీసి కొత్త ఏడాదిని జ‌రుపుకుంటారు. ఉల్లిగ‌డ్డ‌ల‌ను పున‌ర్జ‌న్మ‌కు ప్ర‌తీక‌గా వాళ్లు భావిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల న్యూ ఇయ‌ర్‌లో తాము మంచి వృద్ధి సాధిస్తామ‌ని గ్రీస్ ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తారు. 

జ‌పాన్‌:  సోబా నూడుల్స్ జుర్రుకుంటూ..

జ‌పాన్ ప్ర‌జ‌లు కొత్త ఏడాదిని సోబా నూడుల్స్ జుర్రుకుంటూ మొద‌లుపెడ‌తారు. ఈ సోబా నూడుల్స్ ఎప్పుడు, ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో తెలియ‌దు కానీ.. వాటి స‌న్నని, పొడువాటి ఆకారం సుదీర్ఘ‌, ఆరోగ్యక‌ర‌‌మైన జీవితానికి ప్ర‌తీక‌గా జ‌పాన్ ప్ర‌జ‌లు చూస్తారు. 

డెన్మార్క్‌: ప‌్లేట్స్‌ను ప‌గ‌ల‌గొడుతూ..

కొత్త ఏడాది వేడుక‌లు ముగిసే లోపు త‌మ ఇంటి ముందు ఎన్ని ప‌గిలిపోయిన ప్లేట్లు ఉన్నాయో చూసుకొని మురిసిపోవ‌డం డెన్మార్క్ ప్ర‌జ‌ల‌కు అల‌వాటు. త‌మ ఇంటితోపాటు పక్కింటిపైకి కూడా ప్లేట్లు విసురుతూ ఉంటారు. ఇంటి ముందు ఎన్ని ఎక్కువ ఉంటే అంత అదృష్టం న్యూ ఇయ‌ర్‌లో క‌లిసి వ‌స్తుంద‌న్న‌ది వాళ్ల విశ్వాసం.

ర‌ష్యా:  బూడిద చేసుకొని తాగుతూ..

న్యూఇయ‌ర్ రోజు త‌మ కోరిక‌ల‌ను ఓ పేప‌ర్‌పై రాసుకొని, దానిని కాల్చి ఆ బూడిద‌ను షాంపేన్‌లో క‌లుపుకొని తాగ‌డం ర‌ష్య‌న్ల అల‌వాటు. అలా చేయ‌డం వ‌ల్ల కొత్త ఏడాదిలో త‌మ కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని వాళ్లు భావిస్తారు. 


ఇవి కూడా చ‌ద‌వండి

జనవరి 1 నుంచి కొత్త మార్పులివే.. అవేంటో తెలుసా?!

2020లో మనకు దూరమైన ప్రముఖులు..

రివైండ్‌ 2020: ఊహకందని విషాదాలు.. మార్పులు!

రివైండ్‌ 2020: గంగవ్వ నుంచి కమలా హ్యారీస్‌ వరకు.. ఈ యేటి మేటి మ‌హిళ‌లు వీరే!

అంబానీని వెన‌క్కి నెట్టిన చైనా కుబేరుడు ఝాంగ్ షాన్షాన్‌

రైల్వే టికెట్ల బుకింగ్‌.. ఇక మరింత సులభం

శ్రీవారికి క‌రోనా ఎఫెక్ట్‌.. ఈ ఏడాది ఆదాయం 500 కోట్లే

2020ని మ‌హేష్ స్టైల్‌లో ఫినిష్ చేసిన డేవిడ్ వార్న‌ర్


logo