శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 31, 2020 , 11:53:04

బైడెన్ 'టీమ్ అమెరికా'ను చూశారా?

బైడెన్ 'టీమ్ అమెరికా'ను చూశారా?

వాషింగ్ట‌న్‌: అమెరికా కాబోయే అధ్య‌క్షుడు జో బైడెన్ త‌న టీమ్‌ను చాలా జాగ్ర‌త్త‌గా ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాలోని ప్ర‌తి వ‌ర్గానికీ ఇందులో ప్రాతినిధ్యం ద‌క్కేలా జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే త‌మ పాల‌న‌లో కీల‌క‌పాత్ర పోషించబోయే 100 మంది వైట్‌హౌజ్ స‌భ్యుల‌ను బైడెన్ ట్రాన్సిష‌న్ టీమ్ ప్ర‌క‌టించేసింది. ఇదీ అస‌లుసిస‌లు టీమ్ అమెరికా అనిపించేలా టీమ్ కూర్పు ఉన్న‌ట్లు ఆ టీమ్ వెల్ల‌డించింది. 

61 శాతం మ‌హిళ‌లు

వైట్‌హౌజ్‌లో అపాయింట్ అయిన తొలి 100 మందిలో 61 శాతం మ‌హిళ‌లు కాగా.. 54 శాతం అమెరికాలోని అన్ని వ‌ర్ణాల‌కు చెందిన వ్య‌క్తులు, 11 శాతం ఎల్జీబీటీక్యూ క‌మ్యూనిటికీ చెందిన వాళ్లు ఉన్న‌ట్లు బైడెన్ ట్రాన్సిష‌న్ టీమ్ తెలిపింది. ఈ టీమ్ అమెరికా తొలి రోజు నుంచే త‌మ ప‌నితీరు ఎలా ఉండ‌బోతోందో చూపిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం అమెరికా ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను అధిగ‌మించేందుకు భిన్న‌మైన భావ‌జాలానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం, టాలెంట్‌ను ప్రోత్స‌హించ‌డం చేస్తుంద‌ని బైడెన్ టీమ్ చెబుతోంది. 

అమెరికాలా క‌నిపించేలా టీమ్‌

తాను, వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన క‌మ‌లా హ్యారిస్ మొద‌టి నుంచీ త‌మ టీమ్‌ను అమెరికాలా క‌నిపించేలా తీర్చిదిద్దాల‌ని భావించిన‌ట్లు కాబోయే అధ్య‌క్షుడు జో బైడెన్ వెల్ల‌డించారు. వైవిధ్య‌మైన టీమ్‌ను ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని, దేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి మ‌రిన్ని స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌రిష్కారాలు దొరుకుతాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ టీమ్‌తో తాము సాధించ‌లేనిదంటూ ఏదీ ఉండ‌బోద‌ని బైడెన్ ధీమా వ్య‌క్తం చేశారు. దేశంలోని అత్యుత్త‌మ టీమ్‌తోనే ప్ర‌స్తుతం దేశం ఎదుర్కొంటున్న అసాధార‌ణ స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌గ‌ల‌మ‌ని కాబోయే వైస్ ప్రెసిడెంట్ క‌మ‌లా హ్యారిస్ అభిప్రాయ‌ప‌డ్డారు. 


ఇవి కూడా చ‌ద‌వండి

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌.. ఏ దేశంలో ఎలా జ‌రుపుకుంటారో తెలుసా?

2020లో మనకు దూరమైన ప్రముఖులు..

రివైండ్‌ 2020: ఊహకందని విషాదాలు.. మార్పులు!

రివైండ్‌ 2020: గంగవ్వ నుంచి కమలా హ్యారీస్‌ వరకు.. ఈ యేటి మేటి మ‌హిళ‌లు వీరే!

అంబానీని వెన‌క్కి నెట్టిన చైనా కుబేరుడు ఝాంగ్ షాన్షాన్‌

రైల్వే టికెట్ల బుకింగ్‌.. ఇక మరింత సులభం

శ్రీవారికి క‌రోనా ఎఫెక్ట్‌.. ఈ ఏడాది ఆదాయం 500 కోట్లే


logo