బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Feb 04, 2020 , 00:33:02

స్వాతంత్య్ర వేడుకల్లో తమిళగీతం ఉండదు

స్వాతంత్య్ర వేడుకల్లో తమిళగీతం ఉండదు
  • శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం

కొలంబో: మంగళవారం (ఫిబ్రవరి 4) శ్రీలంక 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సింహళంలో మాత్రమే జాతీయ గేయాన్ని ఆలపించాలని ఆ దేశ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దేశంలో మెజారిటీ సింహళీ ప్రజలు ఉన్నందున సింహళ భాషకే ప్రాధాన్యం ఇస్తామని శ్రీలంక హోంశాఖ అధికారులు తెలిపారు. దేశంలో మైనారిటీలుగా ఉన్న తమిళ సంతతి వారితో సయోధ్య సాధించడం కోసం 2015 నుంచి దేశ స్వాతంత్య్ర దినోత్సవంలో తమిళ జాతీయ గీతాన్ని కూడా ఆలపించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా దీనిని ఉపసంహరించింది.logo
>>>>>>