బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 17:59:02

ఇంట్లో అన్ని గ‌దులుండ‌గా మెట్లు మీద బెడ్ ఏర్పాటు.. ప‌డితే ఇంకేమైనా ఉందా!

ఇంట్లో అన్ని గ‌దులుండ‌గా మెట్లు మీద బెడ్ ఏర్పాటు.. ప‌డితే ఇంకేమైనా ఉందా!

కొన్ని విష‌యాలు విన్న‌ప్పుడు ఎలా స్ప‌దించాలో కూడా అర్థంకాదు. ఈ విష‌యం కూడా అలాంటిదే. ఎవ‌రైనా మంచాన్ని ఇంట్లో వేసుకుంటారు. లోప‌ల ఖాళీ లేక‌పోతే బ‌య‌ట వేసుకుంటారు. లేదంటే మంచాన్ని గోడ‌కు ఆనిచ్చేస్తారు. కానీ వీళ్లెవ‌రో కాని అతి తెలివి ప్ర‌ద‌ర్శించారు. మెట్లు ఖాళీగా ఉన్నాయ‌ని మంచాన్ని వాటి మీద పెట్టేశారు. పెట్టారు స‌రే మ‌రి దాని మీద ప‌డుకోవాలంటే ఎలా అనుకుంటున్నారా? అందుకు ప‌క్క‌నే ఒక చిన్న నిచ్చెన కూడా అమ‌ర్చారు. చ‌దునుగా ఉండే నేల‌మీద మంచం వేస్తేనే ఒక్కోసారి విరిగి కింద‌ప‌డుతుంది. అలాంటిది మెట్లు అంటే.. ప‌డుకోవ‌డానికి ధైర్యం చేయ‌గ‌ల‌రా?

అస‌లు మెట్లు మీద మంచం వేయాల్సిన అవ‌స‌రం ఏముంది అని నెటిజ‌న్లు జుట్టు పీక్కుంటున్నారు. యూకేలోని వెస్ట్ స‌సెక్స్‌కు చెందిన స్టూడియో ఫ్లాట్‌ను అమ్మ‌కానికి పెట్టారు. దీని విలువ సుమారు రూ. 1.22 కోట్లు. ఇంత విలువ చేసే ఇల్లు బాగోలేకుండా ఉంటుందా?  లోప‌ల బ‌య‌ట అద్భుతంగా ఉంది ఇల్లు. లోప‌ల బెడ్‌రూంలు కూడా చాలానే ఉన్నాయి. అయినా ఈ బెడ్‌ను ఎందుకు మెట్లు మీద ఉంచారో అస‌లు అర్థం కావ‌ట్లేదు. పైగా ఈ ఫోటోను ట్విట‌ర్‌లో కూడా షేర్ చేశారు. మ‌రి వీళ్లెందుకు అలా వేశారో మీరు అయినా చెప్తారా అంటూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు. 


logo