ఈ బామ్మ యోధురాలు

లండన్: చిన్న కష్టం రాగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో.. వందేండ్లకు చేరువైన ఓ బామ్మ బతుకాలని బలంగా కోరుకున్నది. ఆమె ఆత్మైస్థెర్యాన్ని చూసి కరోనా, క్యాన్సర్ వంటి రోగాలే కాదు.. విమాన ప్రమాదం, హత్యకు మాస్టర్ ప్లాన్లు వంటివి కూడా ఓడిపోయాయి. ఆమె పేరు జాయ్ ఆండ్రూ. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న యోధురాలు.
ఆత్మస్థైర్యాన్ని వీడలేదు
జాయ్ ఆండ్రూ.. లండన్‌లో 1920లో పుట్టారు. విద్యాభ్యాసం ముగియగానే బ్రిటన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. యూదుల కుటుంబానికి చెందిన ఆండ్రూకు జర్మనీ లో పోస్టింగ్ ఇచ్చారు. రాకపోకలు సాగించడానికి ఆండ్రూకు ఓ కారును, డ్రైవర్‌ను కూడా ఇచ్చారు. అయితే, కారు డ్రైవర్ హిట్లర్ నేతృత్వంలోని నాజీ పార్టీ సానుభూతిపరుడు. అప్పటికే జర్మనీలో హిట్లర్ పాలనలో మైనార్టీలైన యూదు జాతీయులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున విద్వేషం, ఉన్మాదం ప్రచారంలో ఉన్నది. ఆండ్రూ కూడా యూదు జాతీయురాలు అని తెలిసి ఆమెను చంపాలని ఉద్దేశపూర్వకంగా కారు డ్రైవర్.. కారుకు యాక్సిడెంట్ చేశాడు. అయితే, ఆమె ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబర్ కమాండ్‌లో సహాయకురాలిగా విధులు నిర్వహించారు. తర్వాత, ఆండ్రూ బ్రిటిష్ ఎయిర్వేస్లో ఎయిర్‌హోస్టెస్‌గా చేరారు. అయితే, ఒకరోజు విమానం లిబియాలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు మరణించాడు. ఆండ్రూ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. జరుగుతున్న ప్రమాదాలకు వెరవని ఆమె.. తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్న క్రమంలో 1970లో రొమ్ము క్యాన్సర్ అని తేలింది. అయినప్పటికీ, ఆమె ఆత్మైస్థెర్యాన్ని వీడలేదు. మొక్కవోని దీక్షతో క్యాన్సర్‌ను జయించారు. ఈ ఏడాది మేలో ఆండ్రూకి కరోనా సోకింది. 99 ఏండ్ల వయసున్న ఆమెను కాపాడటం కష్టమని వైద్యులు చేతులెత్తేశారు. అయితే, ఆండ్రూ బతకాలని బలంగా కోరుకున్నారు. దీంతో కరోనా కూడా తోకముడిచింది. మరికొద్ది రోజుల్లో ఆండ్రూ వందో పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు