మంగళవారం 26 మే 2020
International - Apr 07, 2020 , 19:33:22

లాక్ డౌన్ లో ఇలా బ‌ర్త్ డే చేసుకోవాల‌ట‌..వీడియో

లాక్ డౌన్ లో ఇలా బ‌ర్త్ డే చేసుకోవాల‌ట‌..వీడియో

లాక్ డౌన్ తో క‌రోనాను త‌రిమికొట్టేందుకు అంద‌రూ స్వ‌చ్చందంగా పుట్టిన‌రోజు వేడుక‌లకు దూరంగా ఉంటున్నారు. అయితే కొంత‌మంది ఏడాదికోసారి వ‌చ్చే బ‌ర్త్ డేను స్పెష‌ల్ గా జ‌రుపుకోవాల‌ని అనుకుంటుంటారు. అలాంటి వారు ఈ టిక్ టాక్‌ వీడియోలో ఉన్న వ్య‌క్తిని ఫాలో అయితే స‌రి. 

ఓ వ్య‌క్తి ముఖానికి మాస్క్ తొడుక్కొని, టేబుల్ ముందు కేక్ పెట్టుకుని కూర్చున్నాడు. ప‌క్కనే హెయిర్ డ్ర‌య్య‌ర్‌ను తీసుకున్నాడు. హెయిర్ డ్ర‌య్య‌ర్స్ నుంచి వ‌చ్చే గాలితో కేక్ పై ఉన్న క్యాండిల్స్ ను ఆర్పివేస్తుండ‌గా..కొంత‌మంది అత‌నికి విషెస్ చెప్పారు. ఏంటీ నిజంగానే అంద‌రూ బ‌ర్త్ డే పార్టీకి వ‌చ్చార‌నుకునేరు.  స్వైప్ వీడియో కాల్ ద్వారా స్నేహితులంతాఈ  బ‌ర్త్ డే బాయ్ పార్టీకి హాజ‌ర‌య్యార‌న్న‌మాట‌. క్వారంటైన్ బ‌ర్త్ డే  హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo