సోమవారం 30 నవంబర్ 2020
International - Oct 23, 2020 , 22:16:12

ఫాదర్‌ ఆశీర్వదిస్తుంటే పాప హైఫై ఇచ్చింది..వీడియో..!

ఫాదర్‌ ఆశీర్వదిస్తుంటే పాప హైఫై ఇచ్చింది..వీడియో..!

హైదరాబాద్‌: చిన్నపిల్లల చేష్టలు భలే సరదాగా ఉంటాయి. మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. కల్మషంలేని మనుషులు పసిపిల్లలు. ఓ చర్చి ఫాదర్‌ ఆశీర్వదించేందుకు చేయి ఎత్తగానే పాప హైఫై చేసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసినవారంతా నవ్వు ఆపుకోలేకపోతున్నారు. 

ఈ వీడియోను మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఫాదర్‌ ఆశీర్వదించేందుకు చెయ్యి ఎత్తగానే పాప హైఫై కొట్టింది. ఇది చూసి ఫాదర్‌కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ వీడియోను ఇప్పటిదాకా సోషల్‌మీడియాలో 22 లక్షలకు పైగా మంది వీక్షించారు. 28,900 పైగా లైక్‌లు, 6,300 రీట్వీట్లు వచ్చాయి.

p>లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.