బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 17, 2020 , 16:39:58

ఆహారం దొంగిలిస్తూ దొరికిపోయిన కుక్క.. ఎలా గిల్టీగా ఫీలవుతుందో చూడండి..!

ఆహారం దొంగిలిస్తూ దొరికిపోయిన కుక్క.. ఎలా గిల్టీగా ఫీలవుతుందో చూడండి..!

హైదరాబాద్‌: ఓ గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్క ఆహారం దొంగిలిస్తూ దొరికిపోయింది. దాని యజమాని మాటలు విని అపరాద భావనతో అక్కడే నిల్చుండి పోయింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. 

గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతికి చెందిన పెంపుడు కుక్క మెల్లగా కిచెన్‌లోకి వచ్చింది. ఎవరూ చూడట్లేదనుకొని తన ముందటి కాళ్లను టేబుల్‌పైన పెట్టి ఆహారమున్న కంటైనర్‌ను తీసుకుంది. ఇదంతా వీడియో తీస్తున్న యజమమాని ‘ఏం చేస్తున్నావ్‌?’ అని గద్దించగానే ఆ బాక్స్‌ను కిందపడేసి, సిగ్గుతో తలదించుకున్నది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చూసినవారంతా కుక్క అచ్చం మనిషిలానే గిల్టీగా ఫీలవుతోందంటూ కామెంట్‌ చేశారు.   


logo