యజమాని బాగు కోసం ఈ శునకం ఏం చేసిందంటే..

ఇస్తాంబుల్ : ఆపద సమయంలో సొంత మనుషులే ముఖం చాటేసే ఈరోజుల్లో ఓ శునకం అనారోగ్యంతో బాధపడుతున్న తన యజమాని కోసం ఏకంగా వారం రోజుల పాటు వైద్యశాల వద్దే పడిగాపులు కాసిన ఘటన అందరినీ కదిలిస్తోంది. యజమాని కోసం కుక్క పడిన వేదన ఫలించి ట్రాబ్‌జన్ నగరంలోని దవాఖాన నుంచి 68 ఏళ్ల సెమల్సెంటక్ డిశ్చార్జి అయ్యారు. సెంటక్ మెదడు సంబంధ వ్యాధితో ఈనెల 14న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి తన యజమాని కోసం బొనక్ పేరుతో పిలుచుకునే చిన్ని కకుక్క వైద్యశాల వద్దే తిష్ట వేసింది.
ప్రతి రోజూ ఉదయం వైద్యశాలకు వచ్చే బొనక్ తన యజమాని కోసం ప్రవేశద్వారం వద్ద వేచిఉండేదని, వారి అనుబంధాన్ని అందరూ గమనించారని, ఇది ప్రతి ఒక్కరినీ సంతోషంలో ముంచెత్తిందని ఆస్పత్రి అధికారి ఫౌట్ ఉగర్ గుర్తుచేసుకున్నారు. చిన్ని కుక్కను సెంటక్ కుమార్తె పలుమార్లు ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా తిరిగి ఆస్పత్రి వైపే పరిగెత్తుకువచ్చేదని చెప్పుకొచ్చారు. సెంటక్ ఆస్పత్రి నుంచి తిరిగివెళుతుండగా ఆయన వీల్‌ఛైర్ పక్కనే బొనక్ సంతోషంగా గంతులేస్తూ తోక ఊపుతూ సంబరపడటం అందరి కండ్లనూ చెమర్చింది. ‘ఇది అందరినీ సంతోషంలో ముంచెత్తుతుంది..ఈ కుక్క ఓ మనిషి లాగే మా అందరికీ చాలా సన్నిహితం..ఇది మిమ్మల్నీ ఆనందంగా ఉంచుతుంద’ని సెంటక్ అన్నారు.
finaly, they came together. ???? pic.twitter.com/qP12L3st9M
— the istanbulist (@istanbulism) January 19, 2021