శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 11:41:18

పుల్ల‌తో గుచ్చితే నాణెంలో బొమ్మ‌లు క‌దులుతున్నాయి : వీడియో వైర‌ల్

పుల్ల‌తో గుచ్చితే నాణెంలో బొమ్మ‌లు క‌దులుతున్నాయి :  వీడియో వైర‌ల్

నాణెం అనగానే ఒకవైపు బొమ్మ‌, మ‌రోవైపు బొరుసు ఉంటుంది‌. వీటి చుట్టూ కొన్ని డిజైన్లు కూడా ఉంటాయి. వాటికో అర్థం కూడా ఉంటుంది. అయితే నాణెంతో బొమ్మ‌, బొరుసు ఆట ఆడుకుంటారు. అందుకోసం నాణాన్ని గిర్రున తిప్పుతారు. కానీ ఈ నాణెంలో మాత్రం బొమ్మ‌లు తిరుగుతున్నాయి.

నాణెం మాత్రం క‌ద‌ల‌కుండా అలానే ఉంది. ఒక టూత్‌పిక్ సాయంతో బొమ్మ‌లు తిరుగుతున్న వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైరల్‌గా మారింది. ఒక చిన్న టూత్‌పిక్ తీసుకొని నాణెంపైన ఉన్న చిన్న బ‌ట‌న్ నొక్కితే అందులో కత్తిని పట్టుకొని ఉన్న చేతిబొమ్మ కదలుతుంది. అప్పుడు ఆ చేయి క‌త్తిపిడిని వ‌దిలేస్తుంది. మ‌రి ఈ బొమ్మ ఎలా ఉంది? ఎలా క‌దులుతుందో ఓ సారి మీరు కూడా చూసేయండి. 


logo