గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 24, 2020 , 19:55:41

డ‌బ్బు దొంగిలిస్తూ ప‌ట్టుబ‌డిన పిల్లి.. ఏం ప్లాన్ వేసిందో చూడాల్సిందే!

డ‌బ్బు దొంగిలిస్తూ ప‌ట్టుబ‌డిన పిల్లి.. ఏం ప్లాన్ వేసిందో చూడాల్సిందే!

కుండ‌లో త‌ల వంచి పాలు తాగుతూ ఎవ‌రూ చూడ‌ట్లేదులే అనుకుంటూ తాగే పిల్లి గురించి తెలుసు. మ‌రి ఈ పిల్లి ఏంటి ఏకంగా డ‌బ్బులే కాజేయాల‌నుకున్న‌ది. బ‌హుశా తాగ‌డానికి పాలు లేవేమో.. కొనుక్కోని తాగేందుకు ఈ ప్ర‌య‌త్నం చేసింన‌ట్లుంది. పాపం పిల్లికేం తెలుసు అక్క‌డ సీసీ కెమెరాలు ఉంటాయి. అందులో దొరికిపోతాం అని. ఈ మ‌నుషులు అంతే పాలు తాగేట‌ప్పుడు క‌నిపెట్టేస్తారు. అలాగే డ‌బ్బు తీసుకున్నా కూడా అంతే.. వీళ్ల ముందు బ‌తికేట‌ట్టు లేదు అనుకున్న‌దో ఏమో షాపు య‌జ‌మానికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన‌ప్పుడు.

17 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో ఒక పిల్లి డ‌బ్బాలో డ‌బ్బు క‌ట్ట ప‌ట్టుకొని పారిపోతూ ఉంటూ అక్క‌డ అత‌ను దాన్ని అడ్డుకున్నాడు. ప‌ట్టుకోగానే నోటితో ప‌ట్టుకున్న డ‌బ్బుక‌ట్ట కింద ప‌డిపోవ‌డంతో షాపు య‌జ‌మాని దాన్ని తీసుకున్నాడు. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌న్నీ చైనాలోనే జ‌రుగుతాయి. అందుకే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. మ‌రింకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి. logo