మంగళవారం 26 జనవరి 2021
International - Dec 24, 2020 , 18:15:13

2021లో క్యాన్స‌ర్‌కు మందు.. ట్రంప్‌కు అంతు చిక్క‌ని రోగం!

2021లో క్యాన్స‌ర్‌కు మందు.. ట్రంప్‌కు అంతు చిక్క‌ని రోగం!

నోస్ట్రాడామ‌స్ తెలుసు క‌దా.. ఎప్పుడో 500 ఏళ్ల కింద‌టే భ‌విష్య‌త్తును ఊహిస్తూ ఈ జ్యోతిష్యుడు రాసిన పుస్త‌కం సంచ‌ల‌నం రేపింది. అంతెందుకు మ‌న బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం కూడా భ‌విష్య‌త్తును ఊహించి చెప్పిన‌దే క‌దా. అయితే ఎప్పుడో 1996లోనే చ‌నిపోయిన ఓ అంధ జ్యోతిష్యురాలు.. 2021 గురించి ముందుగానే ఊహించి చెప్పిన కొన్ని విష‌యాలు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. వాంగెలియా గుష్తెరోవా అనే ఈ జ్యోతిష్యురాలికి నోస్ట్రాడామ‌స్ ఆఫ్ ద బాల్క‌న్స్ అనే పేరు ఉంది. ఈమె చెప్పిన చాలా విష‌యాలు నిజం కావ‌డంతో 2021లోనూ అలాగే జ‌ర‌గ‌బోతోందా అన్న ఆస‌క్తి నెల‌కొన్న‌ది. 2001, సెప్టెంబ‌ర్ 11న అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ల‌పై దాడుల‌ను, బ్రెగ్జిట్‌ను, సోవియ‌ట్ యూనియ‌న్ విచ్ఛిన్నాన్ని, ప్రిన్సెస్ డ‌యానా మ‌ర‌ణాన్ని, చెర్నోబిల్ విప‌త్తును ఈమె ముందుగానే ఊహించింది. 12 ఏళ్ల వ‌య‌సులోనే త‌న చూపును కోల్పోయిన గుష్తెరోవా.. త‌న‌కు భ‌విష్య‌త్తును చూసే అద్భుత‌మైన వ‌రాన్ని దేవుడు ఇచ్చాడ‌ని చెప్పేది. 

2021 గురించి ఏం చెప్పింది?

గుష్తెరోవా ప్ర‌కారం.. 2021లో క్యాన్స‌ర్‌కు చికిత్స‌ను క‌నుగొంటార‌ట‌. అంతేకాదు ఇదే ఏడాది అమెరికా అధ్య‌క్ష పీఠం నుంచి దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ అంతు చిక్క‌ని రోగంతో బాధ‌ప‌డ‌తార‌నీ ఈమె ఊహించింది. ఈ రోగం వ‌ల్ల ఆయ‌నకు వినికిడి లోపం వ‌స్తుంద‌ని, దాని కార‌ణంగా బ్రెయిన్ ట్రామాకు గుర‌వుతార‌ని ఆమె అప్ప‌ట్లోనే చెప్పింది. ఈ ఏడాది గురించి ఆమె ఇంకా ఏం చెప్పిందో చూడండి.

- 2021లో యూర‌ప్ ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంది.

- ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్‌పై సొంత దేశంలోనే హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంది.

- యూర‌ప్‌పై ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు దాడి చేస్తారు.

- పెట్రోల్ ఉత్ప‌త్తి పూర్తిగా నిలిచిపోతుంది. భూమి విశ్రాంతి తీసుకుంటుంది.

- కొందరు ప్ర‌జ‌లు రెడ్ మ‌నీని వాడ‌తారు

- ప్ర‌పంచం మొత్తం విప‌త్తుల‌తో అత‌లాకుత‌లం అవుతుంది.

- పెట్రోల్ ఉత్ప‌త్తులు లేక‌పోవ‌డం వ‌ల్ల రైళ్లు సూర్య‌కాంతి ఉప‌యోగించి న‌డుస్తాయి.

ఇవే కాదు అస‌లు మొత్తం విశ్వం 5079లో అంత‌మ‌వుతుంద‌ని కూడా గుష్తెరోవా అంచ‌నా వేసింది. 


logo